News March 1, 2025
ఇంగ్లండ్‌కు నిరాశ.. సౌతాఫ్రికా విజయం

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌తో మ్యాచులో సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యాన్ని 29.1 ఓవర్లలో ఛేదించింది. ఆ జట్టు బ్యాటర్లలో డస్సెన్ (72), క్లాసన్ (64) రాణించారు. ఇప్పటికే సౌతాఫ్రికాకు సెమీస్ బెర్తు ఖరారు కాగా, ఇంగ్లండ్ ఒక్క విజయం కూడా లేకుండానే నిరాశతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.
Similar News
News March 3, 2025
మార్చి 03: చరిత్రలో ఈ రోజు

1839: టాటా గ్రూపు వ్యవస్థాపకులు జమ్షెట్జీ టాటా జననం
1847: టెలిఫోన్ కనిపెట్టిన అలెగ్జాండర్ గ్రహంబెల్ జననం
1938: తెలుగు హాస్య నటి గిరిజ జననం
1967: ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ జననం
1967: నక్సల్బరీ ఉద్యమం ప్రారంభం
2002: తొలి దళిత లోక్‌సభ స్పీకర్ బాలయోగి మరణం
ప్రపంచ వినికిడి దినోత్సవం
ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం
News March 3, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News March 3, 2025
దుబాయ్ వెళ్లింది మ్యాచ్ కోసం కాదు: హరీశ్ రావు

TG: తాను దుబాయ్ వెళ్లింది క్రికెట్ మ్యాచ్ కోసం కాదని BRS నేత హరీశ్ రావు తెలిపారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కూతురు పెళ్లి కోసం వెళ్లానని ట్వీట్ చేశారు. ‘రాష్ట్రంలో ఉండి కూడా ఎస్ఎల్బీసీ బాధితులను సీఎం పరామర్శించలేదు. మానవత్వం మరచి ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. విలాసాల్లో మునిగింది నేను కాదు.. సీఎం, మంత్రులే. నిఘా పెట్టాల్సింది మా మీద కాదు. ప్రజా ప్రయోజనాలపైనా’ అని పేర్కొన్నారు.