News March 1, 2025

కృష్ణాజిల్లా టుడే టాప్ న్యూస్

image

కృష్ణాజిల్లాలో నేటి ముఖ్యంశాలు * కృష్ణా జిల్లాలో ఇంటర్ మొదటి రోజు పరీక్షకు 98.03% హాజరు*  విజయవాడలో పిల్లలను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్ * కృష్ణా: ప్రజలపై బాలకృష్ణ ఆగ్రహం..YCP రియాక్షన్ * కృష్ణా: అమల్లోకి కొత్త ట్రాఫిక్ రూల్స్ * కృష్ణ విశ్వవిద్యాలయం ఇన్చార్జి రిజిస్టర్‌గా ఆచార్య ఉష * కృష్ణా జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ

Similar News

News March 3, 2025

కృష్ణా జిల్లాలో ఘనంగా మహిళా దినోత్సవ వారోత్సవాలు

image

కృష్ణా జిల్లాలో మహిళా దినోత్సవ వారోత్సవాలు ఆదివారం ఘనంగా జరుగుతున్నాయి. ఎస్పీ ఆర్. గంగాధర రావు ఆదేశాల మేరకు.. జిల్లా పోలీస్ శాఖ మార్చి 1 నుంచి 7వ తేదీ వరకు మహిళా దినోత్సవ వారోత్సవాలు నిర్వహిస్తోంది. రెండవ రోజైన మార్చి 2న అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో మహిళలు, విద్యార్థినులకు యోగ శిక్షణ నిర్వహించారు.

News March 2, 2025

కృష్ణా జిల్లాలో మండుతున్న ఎండలు

image

కృష్ణా జిల్లాలో ఆదివారం ఉష్ణోగ్రతలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గుడివాడ 38°, బాపులపాడు 38°, గన్నవరం 38°, బందరు 34°, పెనమలూరు 37°, పామర్రు 34°, అవనిగడ్డ 32 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పలుచోట్ల పిల్లలు ఎండలను సైతం లెక్కచేయకుండా ఆటలాడుతున్నారు. 

News March 2, 2025

ఉంగుటూరు: విద్యార్థులతో తాపీ పనులు

image

ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లి జెడ్పీ హైస్కూల్‌లో విద్యార్థులతో ఎండలో పని చేయిస్తున్న ఘటన కలకలం రేపింది. హెచ్‌.ఎం, డ్రిల్ మాస్టర్ ఆదేశాలతో విద్యార్థులతో తాపీ పని చేయించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వేసవిలో చెప్పులు లేకుండా విద్యార్థులతో పనిచేయించడం ఆందోళన కలిగిస్తోంది. స్కూల్‌లో ఇలా చేయించడమేంటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

error: Content is protected !!