News March 1, 2025
ఖమ్మం: సంక్షేమ బోర్డును ఎత్తివేసే కుట్ర: ప్రవీణ్

తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఖమ్మం జిల్లా 4వ మహాసభలు శనివారం ఖమ్మం నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ మహాసభలకు ముఖ్యఅతిథిగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. సంఘం జెండా ఆవిష్కరణ అనంతరం జరిగిన మహాసభలో వారు మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికుల కోసం ఎన్నో పోరాటాలు చేసి తెచ్చిన సంక్షేమ బోర్డును ఈ ప్రభుత్వం ఎత్తివేయాలనే కుట్ర పన్నుతుందని ఆరోపించారు.
Similar News
News January 16, 2026
ఖమ్మం: పులిగుండాల చెంత.. పక్షుల కిలకిలరావాలు!

ప్రకృతి ఒడిలో పక్షుల విన్యాసాలను తిలకించేందుకు ‘బర్డింగ్ భారత్’ ఖమ్మం చాప్టర్ అద్భుత అవకాశం కల్పిస్తోంది. జనవరి 18న పులిగుండాల ప్రాజెక్ట్ వద్ద ‘బర్డ్ వాక్’ నిర్వహించనున్నారు. ఉదయం 7:30 నుంచి 9:30 వరకు సాగే ఈ నడకలో పక్షుల జీవవైవిధ్యంపై అవగాహన కల్పిస్తారు. ఆసక్తి గల వారు రూ. 250 ఫీజు చెల్లించి ఈ వినూత్న కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ప్రకృతి ప్రేమికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News January 15, 2026
ఖమ్మం: మిస్సింగ్ యువకుడు సేఫ్

ఖమ్మంలోని ప్రకాష్ నగర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దిలీప్ కుమార్ అదృశ్యం సుఖాంతమైంది.‘వే2న్యూస్’లో వచ్చిన వార్తకు స్పందించిన నేషనల్ హైవే అథారిటీ అధికారులు, స్థానికులు దిలీప్ ఆచూకీని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. త్రీ టౌన్ పోలీసులు బాధితుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. కుమారుడిని సురక్షితంగా అప్పగించడంలో సహకరించిన వే2న్యూస్, అధికారులకు దిలీప్ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
News January 15, 2026
ఖమ్మం: వైద్య సేవలకు ఊతం

ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత విస్తృతం కానున్నాయి. కొత్తగా పది మంది ల్యాబ్ టెక్నీషియన్లను కేటాయించారు. నూతనంగా ఎంపికైన వీరు బుధవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి.నరేందర్‌కు నివేదించారు. వీరి రాకతో ల్యాబ్ సేవలు మరింత వేగంగా అందుతాయని సూపరింటెండెంట్ హర్షం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో సిబ్బంది కొరత తీరడమే కాకుండా, పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు సకాలంలో అందుబాటులోకి రానున్నాయి.


