News March 22, 2024
రేపు బీజేపీ అభ్యర్థుల తుది జాబితా విడుదల?
BJP లోక్‌సభ అభ్యర్థుల తుది జాబితా రేపు విడుదలయ్యే అవకాశముంది. రేపు జరిగే కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో పెండింగ్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు సమాచారం. తెలంగాణలో ఖమ్మం, వరంగల్ స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. ఆరూరి రమేశ్‌కు WGL టికెట్ ఖరారైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఖమ్మం అభ్యర్థిపై స్పష్టత రావాల్సి ఉంది. అటు APలో పోటీ చేసే అభ్యర్థులను కూడా రేపు ఎంపిక చేస్తారని తెలుస్తోంది.
Similar News
News November 2, 2024
గవర్నర్ ప్రతిభా అవార్డులు.. నేటి నుంచి దరఖాస్తులు
TG: ఏటా 4 రంగాల ప్రముఖులకు రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతిభా పురస్కారాలు ఇవ్వాలని గవర్నర్ జిష్ణుదేవ్ నిర్ణయించారు. పర్యావరణం, దివ్యాంగుల సంక్షేమం, క్రీడలు, సాంస్కృతిక విభాగాల్లో ఉత్తమ సేవలు అందించినవారికి అవార్డులు ఇస్తారు. నేటి నుంచి ఈ నెల 23 వరకు https://governor.telangana.gov.in/లో అప్లై చేసుకోవచ్చు. అవార్డు కింద ₹2L, జ్ఞాపిక ఇవ్వనున్నట్లు గవర్నర్ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు.
News November 2, 2024
సుమతీ నీతి పద్యం: విచక్షణ కలిగినవారు ఎవరు?
వినదగు నెవ్వరు సెప్పిన
వినినంతనె వేగపడక వివరింపదగున్
గని కల్ల నిజము దెలిసిన
మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ!
తాత్పర్యం: ఎవరు చెప్పినా వినాలి. వినగానే తొందరపడకుండా నిదానంగా ఆలోచించాలి. ఆ తర్వాత సత్యమేదో, అసత్యమేదో తెలుసుకున్నవారే విచక్షణ కలిగినవారు అని భావం.
News November 2, 2024
బీజేపీ రెబల్స్‌కు శివసేన, ఎన్సీపీ టిక్కెట్లు
మహారాష్ట్ర ఎన్నికల్లో 16 మంది BJP రెబల్స్‌కు శివసేన, NCP టిక్కెట్లు కేటాయించాయి. టిక్కెట్లు పొందని BJP నేతలు ఆ పార్టీని వీడి మహాయుతి మిత్రపక్షాలైన శివసేన, NCPలో చేరారు. ఈ 16 మందిలో 12 మందికి షిండే, నలుగురికి అజిత్ టిక్కెట్లు కట్టబెట్టారు. దీంతో బీజేపీ రెబల్స్ వల్ల మహాయుతికి నష్టం కలగకుండా మిత్రపక్షాలు తమ వైపు తిప్పుకున్నాయి. అయితే, వారిని BJPనే పంపిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి.