News March 1, 2025
BREAKING: కాచిగూడ-నిజామాబాద్ డెమో రైలు రద్దు

కాచిగూడ-నిజామాబాద్ మధ్య నడిచే (77601/77602) డెమో రైళ్లను శనివారం నుంచి మార్చి నెలాఖరు వరకు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాచిగూడ-నిజామాబాద్ సెక్షన్లో ట్రాక్ పునరుద్ధరణ పనులు జరుగుతున్న కారణంగానే ఈ రైళ్లను రద్దు చేసినట్లు సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. ఈ విషయాన్ని ప్రయాణీకులు గమనించాలని ఆయన కోరారు.
Similar News
News March 3, 2025
NZB: పానీపూరి తిని కత్తితో దాడి

ఓ వ్యక్తి పానీపూరి తిని.. రూ.10 డబ్బులు అడిగిన సదరు చిరు వ్యాపారిపై కత్తితో దాడి చేసిన ఘటన నిజామాబాద్‌లో ఆదివారం రాత్రి జరిగింది. నగరంలోని శంకర్ భవన్ స్కూల్ వద్ద చిరు వ్యాపారి ఆకాశ్ పానీపూరీ బండి నడిపిస్తున్నారు. హర్మీత్ సింగ్ అనే వ్యక్తి అక్కడికి వచ్చి ఆకాశ్ వద్ద పానీపూరి తిన్నాడు. అనంతరం ఆకాశ్ డబ్బులు అడిగాడు. నన్నే అడుగుతావా అంటూ హర్మీత్ సింగ్ చిన్న చాకుతో ఆకాశ్ వేళ్ళు కోశాడు.
News March 3, 2025
సిరికొండ : సీనియర్ నేషనల్స్ హాకీ పోటీలకు తూంపల్లి క్రీడాకారిణి

సీనియర్ నేషనల్స్ హాకీ పోటీలకు సిరికొండ మండలం తూంపల్లి క్రీడాకారిణి మమత ఎన్నికైనట్లు అధ్యాపకులు తెలిపారు. ఇటీవల జింఖానా గ్రౌండ్స్‌లో నిర్వహించిన సీనియర్ నేషనల్ హాకీ పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి హాకీ పోటీలకు ఎంపికయ్యారు. జాతీయస్థాయి హాకీ పోటీలు మార్చి 2 నుంచి 10వ తేదీ వరకు హర్యానా రాష్ట్రంలో జరగనున్నాయి. ఈ సందర్భంగా క్రీడాకారిణిని పలువురు అభినందించారు.
News March 2, 2025
NZB: యథావిధిగా ప్రజావాణి కార్యక్రమం: కలెక్టర్

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 3వ తేదీ నుంచి యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. శాసన మండలి ఎన్నికల పోలింగ్ దృష్ట్యా ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈ కార్యక్రమం తిరిగి సోమవారం నుంచి ప్రారంభం కానుంది.