News March 1, 2025
BREAKING: కాచిగూడ-నిజామాబాద్ డెమో రైలు రద్దు

కాచిగూడ-నిజామాబాద్ మధ్య నడిచే (77601/77602) డెమో రైళ్లను శనివారం నుంచి మార్చి నెలాఖరు వరకు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాచిగూడ-నిజామాబాద్ సెక్షన్లో ట్రాక్ పునరుద్ధరణ పనులు జరుగుతున్న కారణంగానే ఈ రైళ్లను రద్దు చేసినట్లు సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. ఈ విషయాన్ని ప్రయాణీకులు గమనించాలని ఆయన కోరారు.
Similar News
News March 3, 2025
వరంగల్: అతిపెద్ద రన్ వే ఉన్న ఎయిర్‌పోర్ట్ మనదే!

మామునూర్ విమానాశ్రయాన్ని చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ వ్యాపారాల కోసం 1930లో నిర్మించారు. నిజాం కాలంలో దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద రన్ వే కలిగిన ఎయిర్‌పోర్ట్ కూడా మనదే. చైనాతో యుద్దం సమయంలోనూ మన ఎయిర్‌పోర్ట్ సేవలందించింది. మాజీ ప్రధాని నెహ్రూ సైతం ఓసారి ఈ ఎయిర్‌పోర్టులో దిగారు. మరి ఎయిర్‌పోర్ట్‌కు ఏ పేరు పెట్టాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
News March 3, 2025
ఆళ్లగడ్డ: సైబర్ నేరగాళ్ల వలలో ప్రైవేటు ఉద్యోగి

అధిక డబ్బులకు ఆశపడి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి రూ.72,000 పోగొట్టుకున్న ఘటన ఆళ్లగడ్డలో చోటుచేసుకుంది. రాజేశ్ నాయక్ అనే వ్యక్తి పట్టణంలో టాటా కంపెనీలో లోన్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. టెలిగ్రామ్‌లో సైబర్ నేరగాళ్లు అధిక డబ్బులు వస్తాయని ఆశ చూపి బురిడీ కొట్టించారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఆదివారం పట్టణ ఎస్ఐ నగీన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
News March 3, 2025
నేడు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్

ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో MLC ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్నారు. గత నెల 27న జరిగిన ఎన్నికల ఫలితాలను ఇవాళ వెల్లడించనున్నారు. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. తొలుత ఒక్కో అభ్యర్థికి లభించిన మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించనున్నారు. 50 శాతం ఓట్లు వచ్చిన వారిని విజేతగా ప్రకటిస్తారు. ఇలా జరగకపోతే ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేశారు.