News March 1, 2025
ప.గో. జిల్లా TODAY TOP HEADLINES

✷ తాడేపల్లిగూడెంలో పెన్షన్ పంపిణీ చేసిన కలెక్టర్ ✷ జిల్లాలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం ✷ మార్చి 15 నుంచి 10వ తరగతి పరీక్షలు ✷ ఢిల్లీలో వర్క్ షాపునకు ఎంపికైన మహదేవపట్నం సర్పంచ్ ✷ పోలీస్ ఇండోర్ పరీక్షల్లో టాపర్‌గా మార్టేరు అమ్మాయి ✷ తణుకు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ర్యాలీ ✷ తణుకులో 123 మంది పరీక్షలకు గైర్హాజరు
Similar News
News March 3, 2025
పాలకొల్లు: మాజీ మంత్రి జోగయ్యకు బన్నీ వాసు పరామర్శ

ఇటీవల అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స తీసుకొని ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్న మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్యను ఆదివారం పాలకొల్లులో జనసేన నేత బన్నీ వాసు పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకొన్నారు. పలు రాజకీయ అంశాలపై ఆయనతో చర్చించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బోనం చినబాబు, శిడగం సురేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
News March 2, 2025
ప.గో. జిల్లా TODAY TOP HEADLINES

✷ ప.గో జిల్లాలో ఊపందుకున్న చికెన్ అమ్మకాలు ✷ మావుళ్ళమ్మ అమ్మవారి సేవలో యాంకర్ ఓంకార్ ✷ వేల్పూర్‌లో చికెన్ మేళా ✷ మత్స్యకారుల అభివృద్ధికి కృషి : కేంద్ర సహాయ మంత్రి ✷ ఉండిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి✷ పేరుపాలెం బీచ్‌లో పర్యాటకుల సందడి ✷ పాలకొల్లును కమ్మేసిన పొగ మంచు✷కాలువలోకి దూసుకెళ్లిన రొయ్యల లారీ.
News March 2, 2025
భీమవరం: మావుళ్ళమ్మ సేవలో యాంకర్ ఓంకార్

భీమవరం శ్రీమావుళ్ళమ్మ అమ్మవారిని ప్రముఖ యాంకర్ ఓంకార్ ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అధికారులు ఆయనకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాన్ని అందించారు. ఓంకార్‌తో సెల్ఫీలు దిగేందుకు భక్తులు పోటీపడ్డారు.