News March 1, 2025
నిర్మల్: బైక్‌ను ఢీకొన్న లారీ.. వ్యక్తికి గాయాలు

నిర్మల్‌లోని శివాజీ చౌక్ వద్ద సిగ్నల్ పడడంతో ఆగి ఉన్న బైక్‌ను లారీ ఢీకొంది. దీంతో బైక్ పై వెళ్తున్న వసంతరావు తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. పట్టణానికి చెందిన వసంతరావు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
Similar News
News March 3, 2025
శ్రీలేఖ పాడె మోసిన కర్నూలు డీఈవో

సీ.బెలగల్ మండలం పోలకల్ జడ్పీ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థి శ్రీలేఖ కర్నూలులో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. గోనెగండ్ల మండలం పెద్దనెలటూరులో జరిగిన విద్యార్థిని అంత్యక్రియలలో ఈడీవో శ్యామ్యూల్ పాల్ పాల్గొని, పాడెమోశారు. అంత్యక్రియలకు రూ.20 వేల ఆర్థిక సహాయం అందించారు. కాగా, సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమంలో విద్యార్థినిపై చెట్టు విరిగిపడి, చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే.
News March 3, 2025
వరంగల్: అతిపెద్ద రన్ వే ఉన్న ఎయిర్‌పోర్ట్ మనదే!

మామునూర్ విమానాశ్రయాన్ని చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ వ్యాపారాల కోసం 1930లో నిర్మించారు. నిజాం కాలంలో దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద రన్ వే కలిగిన ఎయిర్‌పోర్ట్ కూడా మనదే. చైనాతో యుద్దం సమయంలోనూ మన ఎయిర్‌పోర్ట్ సేవలందించింది. మాజీ ప్రధాని నెహ్రూ సైతం ఓసారి ఈ ఎయిర్‌పోర్టులో దిగారు. మరి ఎయిర్‌పోర్ట్‌కు ఏ పేరు పెట్టాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
News March 3, 2025
ఆళ్లగడ్డ: సైబర్ నేరగాళ్ల వలలో ప్రైవేటు ఉద్యోగి

అధిక డబ్బులకు ఆశపడి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి రూ.72,000 పోగొట్టుకున్న ఘటన ఆళ్లగడ్డలో చోటుచేసుకుంది. రాజేశ్ నాయక్ అనే వ్యక్తి పట్టణంలో టాటా కంపెనీలో లోన్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. టెలిగ్రామ్‌లో సైబర్ నేరగాళ్లు అధిక డబ్బులు వస్తాయని ఆశ చూపి బురిడీ కొట్టించారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఆదివారం పట్టణ ఎస్ఐ నగీన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.