News March 1, 2025

విశాఖ: సోదరి ఇంటికి వెళ్తూ ప్రమాదంలో మహిళ మృతి

image

విశాఖ సెంట్రల్ జైల్ సమీపంలో ఎస్ఎస్ఎ నగర్ ఎదురుగా బిఆర్ఎస్ రోడ్డులో స్కార్పియో వాహనం ఢీకొని గెడ్డం సావిత్రి(62) అనే మహిళ మృత్యువాత పడినట్లు ఆరిలోవ ట్రాఫిక్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. రోడ్డు దాటుతుండగా సెంటర్ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. మృతురాలు ఆనందపురం గ్రామం కాగా స్థానికంగా ఉన్న సోదరి ఇంటికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడినట్లు తెలిపారు.

Similar News

News March 7, 2026

విశాఖ: పన్నులు చెల్లించకుంటే జప్తే

image

ఆర్థిక సంవత్సరం ముగుస్తుండగా జీవీఎంసీ అధికారులు పన్నుల వసూళ్లపై దృష్టి సారించారు. రూ.650 కోట్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు మొండి బకాయిదారులపై చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే 1,36,149 మంది బకాయిదారులను గుర్తించి, 1,10,136 మందికి జప్తు నోటీసులు జారీ చేశారు. నీటి పన్ను చెల్లించని 62,290 మందికి కనెక్షన్లు తొలగిస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం రూ.458.9 కోట్లు వసూలు కాగా, రూ.188.20 కోట్లు రావాల్సి ఉంది.

News March 6, 2026

స్టడీ టూర్‌కు పట్టుబడుతున్న జీవీఎంసీ కార్పొరేటర్లు

image

విశాఖ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు మరోసారి స్టడీ టూర్ నిర్వహించాలని పట్టుబడుతున్నారు. ఈనెల 17తో పాలకవర్గం పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో కనీసం ఒక్కసారి అధ్యయన యాత్రకు అనుమతి ఇవ్వాలని మేయర్, కమిషనర్‌ను కోరుతున్నారు. ఐదేళ్ల కాలంలో నాలుగేళ్లపాటు మాత్రమే యాత్రలు జరిగాయని, ఒక సంవత్సరం మిగిలిపోయిందని వారు చెబుతున్నారు. ఈనెల 10 నుంచి 14 వరకు టూర్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

News March 6, 2026

విశాఖ: 5 నిమిషాల ఆలస్యంతో అవకాశం కోల్పోయారు

image

రైల్వే టెక్నీషియన్ గ్రేడ్-3 పరీక్షకు ఐదు నిమిషాలు ఆలస్యం కావడంతో సుమారు పది మంది అభ్యర్థులు అవకాశం కోల్పోయారు. పెందుర్తి చినముషిడివాడ డిజిటల్ అయాన్ సెంటర్‌లో శుక్రవారం ఉదయం మొదటి షిఫ్ట్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఉదయం 7:30 నుంచి 8:30 వరకు రిపోర్టింగ్ సమయం కాగా, అభ్యర్థులు 8:35 గంటలకు రావడంతో వారిని అనుమతించలేదు. ఈ పరీక్షకి ఒడిశా నుంచి వచ్చామని, అవకాశం కోల్పోయామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు.