News March 1, 2025

భద్రాద్రి: కనిపించిన నెలవంక.. రేపటి నుంచి రంజాన్

image

భద్రాద్రి జిల్లాలో రంజాన్ పవిత్ర మాసం ఆదివారం నుంచి ప్రారంభమవనుందని ముస్లిం మత పెద్దలు తెలిపారు. దేశంలోని అన్నీ ప్రాంతాల్లో నెలవంక శనివారం కనిపించడంతో రేపటి నుంచి ముస్లింలు ఉపవాస దీక్షలు చేపట్టనున్నారు. కాగా, రోజా పాటించే ముస్లింలు నమాజ్‌కు మొదటి ప్రాధాన్యతనిస్తారు. నమాజ్‌ కోసం అన్ని మసీదుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సహర్‌ నుంచి ఇఫ్తార్‌ వరకు ఉపవాస దీక్షలు పాటిస్తారు.

Similar News

News March 3, 2025

వారానికి 60 గంటల పని: గూగుల్ కో ఫౌండర్

image

ఉద్యోగులను యంత్రాలుగా చూస్తున్న వారి జాబితాలోకి గూగుల్ కో ఫౌండర్ సెర్జీ బ్రిన్ కూడా వచ్చేశారు. ఇప్పటికే నారాయణమూర్తి, L&T సంస్థల ఫౌండర్లు 70 గంటలు పనిచేయాలని కామెంట్ చేయగా, సెర్జీ బ్రిన్ కూడా ఇలానే మాట్లాడారు. ‘AI రేసులో నిలవాలంటే వారానికి 60 గంటలు పనిచేయాలి. ప్రతిరోజూ ఆఫీసుకు రావాలి. అప్పుడే మంచి ప్రొడక్టివిటీ వస్తుంది. ఈ రేసులో మనం నిలవాలి, గెలవాలంటే తప్పదు’ అని ఆయన ఉద్యోగులకు నోట్ రాశారు.

News March 3, 2025

HYD: ‘కులగణనలో తప్పులుంటే ఆధారాలతో రండి’

image

కులగణనలో తప్పులుంటే ఆధారాలతో రండి చర్చకు సిద్ధమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ హయాంలోనే మెట్రో రైలు పనులు ప్రారంభమయ్యాయని, మెట్రో విస్తరణ కూడా కాంగ్రెస్ హయాంలోని జరుగుతుందన్నారు. ఏ కులానికి వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం కాంగ్రెస్‌కు లేదన్నారు.

News March 3, 2025

280 మంది ఇంటర్ పరీక్షలు రాయలేదు: కలెక్టర్

image

అనకాపల్లి జిల్లాలో సోమవారం ప్రారంభమైన ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలకు 280 మంది గైర్హాజరైనట్లు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. జనరల్, వొకేషనల్ విభాగాలకు కలిపి మొత్తం 12,318 మంది విద్యార్థులకు గాను 12,038 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా మాస్ కాపీయింగ్ జరగలేదని కలెక్టర్ స్పష్టం చేశారు.

error: Content is protected !!