News March 1, 2025

విశాఖపట్నంలో టుడే టాప్ న్యూస్

image

➤ ఏయూ వైస్ ఛాన్సలర్‌గా బాధ్యతలు చేపట్టిన జి.పి.రాజశేఖర్ ➤ ప్రశాంతంగా ప్రారంభమైన మొదటిరోజు ఇంటర్ పరీక్షలు➤ జిల్లా వ్యాప్తంగా 87 కేంద్రాలలో 95 % మంది మొదటిరోజు పరీక్షకు హాజరైన విద్యార్థులు➤ KGHలో శిశువులు మార్పిడి.. ఒకరు సస్పెండ్, ఇద్దరికి చార్జీ మెమోలు➤ సింహాచలం ఈవోగా బాధ్యతలు స్వీకరించిన సుబ్బారావు➤జిల్లా వ్యాప్తంగా మూడు మిస్సింగ్ కేసులు ఛేదించిన పోలీసులు

Similar News

News November 7, 2025

విశాఖ: ప్రమాద బాధితులకు పరిహారం అందజేత

image

విశాఖ సీపీ కార్యాలయంలో రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా గురువారం పరిహారం అందజేశారు. హిట్ అండ్ రన్ కేసులో గాయపడిన సీతమ్మధారకు చెందిన కనపర్తి వీరేందర్, గ్రీన్ గార్డెన్‌కు చెందిన జాగు సత్యనారాయణకు రూ.50వేలు చొప్పున వారి బ్యాంకు ఖాతాలో జమ చేశారు. ఇప్పటివరకు 90 మందికి రూ.72 లక్షల పరిహారం అందించినట్లు సీపీ శంఖబ్రత బాగ్చి వెల్లడించారు.

News November 7, 2025

రూ.10 లక్షల కోట్ల ఒప్పందాలు.. 7.30 లక్షల ఉద్యోగుల కల్పన

image

రాష్ట ప్రభుత్వం ఈ నెల 14, 15న నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సును విజయవంతం చేసి పది లక్షల కోట్ల ఒప్పందాలు, 7.30 లక్షల ఉద్యోగుల కల్పన ధ్యేయంగా పనిచేస్తున్నామని స్వచ్ఛంద కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్ అన్నారు. GVMC ప్రధాన కార్యాలయంలో సదస్సుకు సంబంధించి వివరాలు వెల్లడించారు. జీరో వేస్ట్ కాన్సెప్ట్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి కే బాటిల్స్ వినియోగిస్తున్నామన్నారు.

News November 6, 2025

‘గూగుల్ సెంటర్‌తో వందల సంఖ్యలోనే ఉద్యోగాలొస్తాయి’

image

విశాఖలో గూగుల్ సెంటర్ ఏర్పాటు చేస్తే లక్షల్లో ఉద్యోగాలు రావని, వందల సంఖ్యలో మాత్రమే ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చింత మోహన్ అన్నారు. సుందర్ పిచాయ్ పేదవాడు కాదని అపర కోటీశ్వరుడన్నారు. 500 ఎకరాలు ఇచ్చి భూములతో వ్యాపారం చేయడం చంద్రబాబుకు పిచాయ్‌కి మధ్య ఉన్న బంధం ఏంటో వెల్లడించాలన్నారు. ఈనెల 31లోపు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కాదని కేంద్రం ప్రకటన చేయలన్నారు.