News March 22, 2024
ప్రకాశం జిల్లాకు చంద్రబాబు రాక

సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఈనెల 31న జిల్లాకు రానున్నారు. కొండపి నియోజకవర్గంలో నిర్వహించనున్న ప్రజాగళం సభలో ఆయన పాల్గొంటారు. ఈ సభకు విద్యావంతులు, ఐటీ ఉద్యోగులు, న్యాయవాదులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులను ఆహ్వానిస్తున్నట్లు టీడీపీ నాయకులు వెల్లడించారు. అనంతరం మార్కాపురంలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారని వివరించారు.
Similar News
News September 5, 2025
ఎరువుల కొరత సృష్టిస్తే కఠిన చర్యలు: సబ్ కలెక్టర్

మార్కాపురం MPDO కార్యాలయంలో ఎరువుల నియంత్రణ చట్టంపై వ్యవసాయ సహాయకులకు, డీలర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సబ్ కలెక్టర్ S.V.త్రివినాగ్ ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ.. ఎరువుల కొరత సృష్టిస్తే డీలర్షిప్ రద్దు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎరువులను MRP ధరలకే విక్రయించాలని సూచించారు. MRO చిరంజీవి, SI సైదుబాబు పాల్గొన్నారు.
News September 4, 2025
ప్రకాశం జిల్లాలో మరో 4 బార్లకు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లా వ్యాప్తంగా ఓపెన్ కేటగిరిలో నాలుగు బార్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి ఆయేషా బేగం గురువారం తెలిపారు. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో 2, మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలో 2 బార్లకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. ఈనెల 14వ తేదీ సాయంత్రం 6 గంటలలోగా దరఖాస్తులు అందించాలని చెప్పారు. 15న లాటరీ తీస్తామని, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు.
News September 4, 2025
ప్రకాశం జిల్లాలో మరో 4 బార్లకు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లావ్యాప్తంగా ఓపెన్ కేటగిరిలో నాలుగు బార్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి ఆయేషా బేగం గురువారం తెలిపారు. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో 2, మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలో 2 బార్లకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. ఈనెల 14వ తేదీ సాయంత్రం 6 గంటలలోగా దరఖాస్తులు అందించాలని చెప్పారు. 15న లాటరీ తీస్తామని, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు.