News March 2, 2025
HYD: వ్యభిచార గృహంపై పోలీసుల దాడులు

అంబర్‌పేట్ గోల్నాక జిందాతిలిస్మాత్ వీధిలో ఓ వ్యభిచార గృహంపై పోలీసుల దాడులు నిర్వహించారు. నలుగురు మహిళలను రెస్క్యూ హోంకు తరలించారు. అందులో ముగ్గురు ఉగాండా, ఒకరు కెన్యా చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వ్యభిచార గృహం నిర్వాహకుడు లైబీరియా దేశానికి చెందిన వ్యక్తితో పాటు ఒక విటుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 3, 2025
మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్

పార్వతీపురం జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మహిళా దినోత్సవ వేడుకల నిర్వహణపై సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా దినోత్సవ వేడుకల్లో మహిళలందరినీ భాగస్వాములను చేయాలన్నారు.
News March 3, 2025
అసెంబ్లీలో సభ్యులకు సీట్లు కేటాయింపు

AP అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు సీట్లు కేటాయిస్తూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు నిర్ణయం తీసుకున్నారు. ట్రెజరీ బెంచ్‌కు ముందు వరుసలో CM, డిప్యూటీ CM, మంత్రులకు సీట్లు కేటాయించారు. సీఎం చంద్రబాబుకు ఒకటో నంబర్ సీటు ఇవ్వగా, డిప్యూటీ సీఎం పవన్‌కు 39వ సీటు ఇచ్చారు. సీనియారిటీ ప్రాతిపదికన మిగతా ఎమ్మెల్యేలకు సీట్లు కేటాయించారు. మాజీ CM, YCP పక్ష నేతగా జగన్‌కు ప్రతిపక్ష బెంచిలో ముందు వరుసలో సీటు ఇచ్చారు.
News March 3, 2025
DA అప్డేట్: హోలీ పండగ లోపు గుడ్‌న్యూస్!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కారు త్వరలోనే శుభవార్త చెప్పబోతోందని సమాచారం. ఈ నెల్లోనే DA సవరణ చేపడుతుందని తెలిసింది. హోలీ పండగ లోపు ఎంత శాతం ఇస్తారో ప్రకటిస్తుందని వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ CPI డేటా ప్రకారం పెంపు 2% వరకు ఉండొచ్చని విశ్లేషకుల అంచనా. ఈ లెక్కన DA 55.98 శాతానికి చేరుకుంటుంది. ఏడో వేతన సంఘం ప్రకారం ఏటా 2సార్లు DAను ప్రకటించాలి. జనవరికి సంబంధించి మార్చిలో వెల్లడిస్తుంది.