News March 2, 2025
నాగర్ కర్నూల్ జిల్లా.. నేటి ముఖ్యాంశాలు

✓నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో స్వయం స్వపరిపాలన దినోత్సవం నిర్వహణ.
✓నాగర్ కర్నూల్ జిల్లాలో రేపటి నుండి రంజాన్ మాస ఉపవాస అధ్యక్షులు ప్రారంభం.
✓జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.
✓వంగూరు మండలం కొండారెడ్డిపల్లి లో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు హేమలత పదవి విరమణ.
✓ముస్లిం సోదరి సోదరీ మణులకు రంజాన్ మాసపు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి.
Similar News
News January 14, 2026
నేడు మేడారంలో ‘గుడి మెలిగే’ పండగ

వనదేవతల మహాజాతరకు కౌంట్‌డౌన్ మొదలైంది. మరో 13 రోజుల్లో జాతర ప్రారంభం కానుండగా, బుధవారం ‘గుడి మెలిగే’ పండగతో జాతర ఆచారాలకు శ్రీకారం చుట్టనున్నారు. సంప్రదాయం ప్రకారం జాతరకు రెండు వారాల ముందుగా పూజారులు దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నేటి నుంచి జాతర ప్రక్రియ అధికారికంగా మొదలైనట్లేనని భక్తులు భావిస్తారు. ఈ నెల 21న మండమెలిగే పండగ, 28న అమ్మవార్లు గద్దెపైకి చేరడంతో జాతర పతాక స్థాయికి చేరుకోనుంది.
News January 14, 2026
HYD: నగర శివారులో నయా పార్క్

నగరవాసులకు మరో ఆకర్షణీయమైన ఉద్యానవనం అందుబాటులోకి రానుంది. TG సాంస్కృతిక సంపద, కళాత్మక వైభవం ఉట్టిపడేలా శివారు తెల్లాపూర్‌లో ‘తెలంగాణ ట్రిబ్యూట్ గార్డెన్’ను అభివృద్ధి చేయడానికి HMDA కంకణం కట్టింది. 10 ఎకరాల్లో రూ.48 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కృష్ణా-గోదావరి వాటర్‌వేస్, కాకతీయ శిల్పకళతో పర్యాటక ఆకర్షణగా పార్కును తీర్చిదిద్దనున్నారు. ప్రభుత్వ అనుమతులు రాగానే పనులు ప్రారంభంకానున్నాయి.
News January 14, 2026
గద్వాల: మున్సిపాలిటీల తుది ఓటర్ జాబితా విడుదల

గద్వాల జిల్లాలో త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా అధికారులు తుది ఓటర్ జాబితాను నేడు విడుదల చేశారు. అలంపూర్‌లో 10 వార్డుల్లో పురుషులు-4681 మహిళాలు-4940, ఇతరులు ఒకరు ఉన్నారు. గద్వాల్లో 37 వార్డులలో మొత్తం 65282 ఉండగా పురుషులు-31684, మహిళాలు-33558, ఇతరులు 10 మంది ఉన్నారు. ఐజలో 20 వార్డులలో మొత్తం 23016 ఉండగా పురుషులు-11230, మహిళా-11786 ఉండగా.. వడ్డేపల్లిలో 5256 పురుషులు, 5347 మహిళాలున్నారు.


