News March 2, 2025
ఈనెల 8న కొత్త పథకాలు ప్రారంభం: మంత్రి సీతక్క

TG: ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో లక్ష మంది మహిళలతో సభ నిర్వహించనున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. ఆ రోజున CM రేవంత్ కొత్త పథకాలను ప్రారంభిస్తారని తెలిపారు. RTCకి అద్దెకు ఇచ్చే మహిళా సంఘాలకు చెందిన 50 బస్సులను ప్రారంభిస్తారని, 14,236 అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు.
Similar News
News March 3, 2025
SEBI మాజీ చీఫ్, BSE అధికారులకు స్వల్ప ఊరట

మార్కెట్ అవకతవకలు, కార్పొరేట్ మోసం కేసులో SEBI, BSE అధికారులపై ACB FIR ఫైల్ చేయాలన్న ముంబై సెషన్స్ కోర్టు ఆదేశాలను బాంబే హైకోర్టు నిలిపివేసింది. ముందస్తుగా నోటీసులు ఇవ్వకపోవడంతో సెషన్స్ కోర్టు ఆదేశాలు చెల్లుబాటు కావన్న రెస్పాండెంట్స్ లాయర్ల వాదనను అంగీకరించింది. TUE వాదనలు వింటామంది. సెబీ మాజీ చీఫ్ మాధబీ, మెంబర్లు అశ్వనీ, అనంత్, కమలేశ్, BSE ఛైర్మన్ ప్రమోద్, CEO సుందర రామన్‌కు ఊరటనిచ్చింది.
News March 3, 2025
టెన్త్ హాల్ టికెట్లు విడుదల

AP: పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లను విద్యాశాఖ విడుదల చేసింది. https://bse.ap.gov.in/ వెబ్‌సైట్ నుంచి <
News March 3, 2025
చదివేటప్పుడు నిద్ర కమ్ముకొస్తుందా?

అలా అయితే కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని చదవడం ప్రారంభించండి. ఎట్టిపరిస్థితుల్లోనూ పడుకొని చదవొద్దు. చదివే సమయంలో నీరు ఎక్కువగా తాగండి. గట్టిగా చదవటం, నోట్స్ రాయటం వల్ల నిద్ర రాకుండా ఉంటుంది. 50ని.లకు ఒకసారి బ్రేక్ తీసుకొని, ముఖాన్ని చల్లటి నీటితో కడగండి. మీ రీడింగ్ రూంలో సరైన వెలుతురు ఉండేలా చూసుకోండి. బ్రేక్ టైంలో కాస్త నడిస్తే మైండ్ రీఫ్రెష్ అవుతుంది. లైట్ ఫుడ్ తీసుకుంటే మంచిది. Share It.