News March 2, 2025
KMR: ఇంటి వద్దే పురుడు పోసిన 108 సిబ్బంది

పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణికి 108 సిబ్బంది ఇంటి వద్దే పురుడు పోశారు. పెద్ద కొడప్గల్ మండలం తలాబ్ తండా వాసి ఉజ్వలకు శనివారం సాయంత్రం పురిటి నొప్పులు రావడంతో 108కి సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది ఇంటికి చేరుకున్నారు. పురిటి నొప్పులు అధికమవ్వడంతో ఇంటి వద్దే EMT ప్రభాకర్ ఆమెకి పురుడు పోశారు. ఆమె ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లి బిడ్డకు పిట్లం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు.
Similar News
News October 18, 2025
SPMVV: ఫలితాలు విడుదల

శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో (B.Voc) బ్యాచిలర్ ఆఫ్ వోకేషనల్ డిగ్రీ ఇన్ ఫ్యాషన్ టెక్నాలజీ, న్యూట్రిషన్ అండ్ హెల్త్ కేర్ సైన్స్ ఐదవ సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు విడుదలైనట్లు వర్సిటీ కార్యాలయం పేర్కొంది. ఫలితాలను https://www.spmvv.ac.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
News October 18, 2025
DRDO PXEలో 50 అప్రెంటిస్‌లు

DRDOకు చెందిన ప్రూఫ్ అండ్ ఎక్స్‌పరిమెంటల్ ఎస్టాబ్లిష్‌మెంట్(PXE) 50 గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిప్లొమా, బీటెక్, బీఈ అర్హత గలవారు ఈనెల 19 వరకు training.pxe@gov.in మెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్‌లో ఎన్‌రోల్ చేసుకోవాలి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.drdo.gov.in
News October 18, 2025
ప్రభుత్వానికి ‘ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత’ ప్రతిపాదనలు

TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేస్తూ ఇటీవల రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు పంచాయతీరాజ్ శాఖ సవరణకు చర్యలు చేపట్టింది. ఈ నిబంధన సవరించాలని కోరుతూ ప్రభుత్వానికి పంచాయతీరాజ్ శాఖ ప్రతిపాదనలు పంపింది. సర్కార్ ఆమోదం అనంతరం కొత్త సవరణలతో అధికారిక ఉత్తర్వులు రానున్నాయి. అటు BC రిజర్వేషన్ల అంశం తేలిన తర్వాత రాష్ట్రంలో ఎన్నికలు జరిగే అవకాశముంది.