News March 22, 2024

REWIND: జనతా కర్ఫ్యూకి నాలుగేళ్లు

image

కొవిడ్ మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసింది. అయితే, కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం 2020 మార్చి 22న దేశంలో ‘జనతా కర్ఫ్యూ’ విధించింది. నేటికి నాలుగేళ్లు పూర్తవుతోంది. ఆ తర్వాత క్రమంగా దాదాపు 2 నెలల పాటు లాక్‌డౌన్ కొనసాగింది. వైరస్‌ని కట్టడి చేసేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నా.. ప్రజలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాని నుంచి కోలుకునేందుకు ఏడాది పట్టింది.

Similar News

News November 2, 2024

గవర్నర్ ప్రతిభా అవార్డులు.. నేటి నుంచి దరఖాస్తులు

image

TG: ఏటా 4 రంగాల ప్రముఖులకు రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతిభా పురస్కారాలు ఇవ్వాలని గవర్నర్ జిష్ణుదేవ్ నిర్ణయించారు. పర్యావరణం, దివ్యాంగుల సంక్షేమం, క్రీడలు, సాంస్కృతిక విభాగాల్లో ఉత్తమ సేవలు అందించినవారికి అవార్డులు ఇస్తారు. నేటి నుంచి ఈ నెల 23 వరకు https://governor.telangana.gov.in/లో అప్లై చేసుకోవచ్చు. అవార్డు కింద ₹2L, జ్ఞాపిక ఇవ్వనున్నట్లు గవర్నర్ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు.

News November 2, 2024

సుమతీ నీతి పద్యం: విచక్షణ కలిగినవారు ఎవరు?

image

వినదగు నెవ్వరు సెప్పిన
వినినంతనె వేగపడక వివరింపదగున్
గని కల్ల నిజము దెలిసిన
మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ!
తాత్పర్యం: ఎవరు చెప్పినా వినాలి. వినగానే తొందరపడకుండా నిదానంగా ఆలోచించాలి. ఆ తర్వాత సత్యమేదో, అసత్యమేదో తెలుసుకున్నవారే విచక్షణ కలిగినవారు అని భావం.

News November 2, 2024

బీజేపీ రెబ‌ల్స్‌కు శివ‌సేన‌, ఎన్సీపీ టిక్కెట్లు

image

మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లో 16 మంది BJP రెబ‌ల్స్‌కు శివ‌సేన, NCP టిక్కెట్లు కేటాయించాయి. టిక్కెట్లు పొందని BJP నేత‌లు ఆ పార్టీని వీడి మ‌హాయుతి మిత్ర‌ప‌క్షాలైన శివ‌సేన, NCPలో చేరారు. ఈ 16 మందిలో 12 మందికి షిండే, న‌లుగురికి అజిత్ టిక్కెట్లు క‌ట్ట‌బెట్టారు. దీంతో బీజేపీ రెబల్స్ వల్ల మ‌హాయుతికి న‌ష్టం క‌ల‌గ‌కుండా మిత్ర‌పక్షాలు త‌మ వైపు తిప్పుకున్నాయి. అయితే, వారిని BJPనే పంపిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి.