News March 2, 2025
అనంత: చెత్త సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

తాడపత్రి మండలం ఎర్రగుంట్లలో వ్యక్తిగత ఇంకుడు గుంతకు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని కలెక్టర్ శనివారం పరిశీలించారు. ఇంటింటి నుంచి చెత్త సేకరణ, తడి, పొడి చెత్త విభజన వర్మి కంపోస్టు తయారీ విధానం గురించి వివరించారు. చెత్త నుంచి తయారైన ఎరువుల ప్యాకెట్ల రేట్లు తదితర వివరాలను కలెక్టర్ అడిగారు.
Similar News
News March 3, 2025
రాష్ట్రపతి భవన్ నుంచి ధర్మవరం చేనేతకు ఆహ్వానం

ధర్మవరానికి చెందిన చేనేత డిజైనర్ నాగరాజుకు రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం అందడం చాలా సంతోషంగా ఉందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. చేనేతను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం Vividtha Ka Amrit Mahotsav కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని పేర్కొన్నారు. అందులో భాగంగా రాష్ట్రపతి భవన్లో ధర్మవరం పట్టు చీరల ప్రదర్శన కోసం నాగరాజు ఆహ్వానం అందుకోవడం గొప్ప విషయమని కొనియాడారు.
News March 3, 2025
విషాద ఘటనపై మంత్రి పయ్యావుల దిగ్భ్రాంతి

అనంతపురం జిల్లా కూడేరు మండలం కమ్మూరు వద్ద జరిగిన ప్రమాదంలో నలుగురు మృతి చెందిన ఘటనపై మంత్రి పయ్యావుల కేశవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం తన మనసును కలిచి వేసిందని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని తెలిపారు. కాగా ఈ విషాద ఘటనలో ముగ్గరు అక్కాచెల్లెళ్లు, మూడు నెలల చిన్నారి మృతిచెందిన విషయం తెలిసిందే.
News March 3, 2025
22,960 మంది విద్యార్థులు.. ఉ.9 నుంచి పరీక్ష

ఇంటర్ సెకండియర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి మ.12 వరకు ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2 పరీక్ష జరగనుంది. అనంతపురం జిల్లాలో రెండో సంవత్సరం విద్యార్థులు 22,960 మంది ఉండగా జిల్లా వ్యాప్తంగా 63 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 8.30 గంటలకు విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు.
☛ All The Best Students