News March 2, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
Similar News
News March 3, 2025
రాజస్థాన్ విద్యుత్ శాఖతో సింగరేణి ఒప్పందం

TG: సింగరేణి వ్యాపార విస్తరణలో మరో ముందడుగు పడింది. రాజస్థాన్ విద్యుత్ శాఖతో 3,100 మెగావాట్ల ప్రాజెక్టులపై సింగరేణి ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు 1,600 మె.వా. థర్మల్, 1,500 మె.వా. సోలార్ విద్యుదుత్పత్తికి రాజస్థాన్ వెళ్లిన Dy.CM భట్టి విక్రమార్క, ఆ రాష్ట్ర CM భజన్‌లాల్ శర్మ సమక్షంలో MOU జరిగింది. ఈ జాయింట్ వెంచర్‌లో సింగరేణి 74%, రాజస్థాన్ 26% చొప్పున ఖర్చులు, లాభాలు పంచుకోనున్నాయి.
News March 3, 2025
బీచ్‌లకు బ్లూఫ్లాగ్ గుర్తింపు ఎలా ఇస్తారంటే?

బీచ్‌లో నీటి నాణ్యత, పర్యావరణ విధానాలు, భద్రతలో మంచి ప్రమాణాలు పాటిస్తేనే బ్లూఫ్లాగ్ గుర్తింపు వస్తుంది. మలినాలు, రసాయనాలు బీచ్‌లో కలవకూడదు. PH ప్రమాణాలు బాగుండాలి. CC కెమెరాలు, డ్రైనేజ్, వ్యర్థాల నిర్వహణ, టాయిలెట్స్, సెక్యూరిటీ వంటి 33రకాల సౌకర్యాలు ఉండాలి. INDలో 12 బీచ్‌లకే ఈ గుర్తింపు ఉండగా, <<15632535>>రుషికొండ <<>>ఒకటి. డెన్మార్క్‌లోని ద ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ అనే సంస్థ ఈ ట్యాగ్ ఇస్తుంది.
News March 3, 2025
బ్లూఫ్లాగ్ గుర్తింపుతో ఉపయోగం ఏంటి?

తీర ప్రాంత జలాల్లో మెరుగైన అభివృద్ధి తీసుకురావడమే ఈ <<15632535>>బ్లూఫ్లాగ్ <<>>లక్ష్యం. వరల్డ్ మ్యాప్‌లో కూడా బీచ్‌లకు ఈ గుర్తింపు చూడవచ్చు. ఈ గుర్తింపు ఉన్న బీచ్‌లను సందర్శించడానికి విదేశీయులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ఈ ఫ్లాగ్ ఉంటే శుభ్రత, భద్రత పరంగా ఇబ్బంది ఉండదని వాళ్లు భావిస్తారు. ఈ ఫ్లాగ్ ఉన్న బీచ్‌ల ద్వారా ఆదాయం పెరగడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి.