News March 2, 2025

MNCL: ఇంటర్ పరీక్షా కేంద్రాల సమీపంలో 144 సెక్షన్

image

జిల్లాలో ఈ నెల 5 నుంచి 25వ తేదీ వరకు జరగనున్న ఇంటర్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం మంచిర్యాల కలెక్టరేట్‌లో ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పరీక్షా కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Similar News

News October 19, 2025

రాశులను ఎలా నిర్ణయిస్తారు?

image

వ్యక్తి పుట్టిన సమయం, ప్రదేశం ఆధారంగా రాశులను నిర్ణయిస్తారు. ఆ జన్మించిన సమయానికి ఆకాశంలో చంద్రుడు ఉన్న రాశినే వారి జన్మ రాశిగా పరిగణిస్తారు. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో అది వారి జన్మ నక్షత్రం అవుతుంది. పుట్టిన సమయానికి తూర్పున ఉదయించే రాశిని జన్మ లగ్నంగా వ్యవహరిస్తారు. జన్మ రాశి, నక్షత్రాల ఆధారంగానే జాతక ఫలితాలు నిర్ణయమవుతాయి.
☞ రోజువారీ మీ రాశిఫలాలను జ్యోతిషం <<-se_10008>>కేటగిరీకి<<>> వెళ్లి చూడొచ్చు.

News October 19, 2025

జనగామ: వలస కార్మికులకూ.. లేబర్ కార్డు!

image

ఎక్కడ ఉపాధి దొరికితే అక్కడికి వలస వెళ్లాల్సిందే. జనగామ జిల్లాకు వివిధ రాష్ట్రాల నుంచి భవన నిర్మాణ, ఇతర రంగాల్లో పని చేసేందుకు వలస వచ్చారు. అయితే వారికి కూడా ఇక్కడి ప్రభుత్వం అందించే లేబర్ కార్డు ప్రయోజనాలు ఉంటాయని సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. ఏ రాష్ట్రానికి చెందిన వారైనా సరే వారి స్థానికంగా కార్డు లేకుంటే ఇక్కడ కార్డు జారీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

News October 19, 2025

ఇతిహాసాలు క్విజ్ – 40

image

1. వాల్మీకి రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి?
2. ఎవరి అనుగ్రహం వల్ల కుంతీదేవికి ధర్మరాజు జన్మించాడు?
3. ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని ఏమంటారు?
4. ‘హనుమాన్ చాలీసా’ను రచించిన భక్తుడు ఎవరు?
5. భద్రాచలం రాముడి ఆలయాన్ని నిర్మించింది ఎవరు?
– సరైన సమాధానాలు సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>