News March 2, 2025
జ్వరం వచ్చినప్పుడు వీటిని తింటున్నారా?

జ్వరం వచ్చినప్పుడు కొందరు అస్సలు తినరు. మరికొందరు నచ్చినట్లు తింటారు. కానీ ఇలా తినడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాలు, చీజ్, పెరుగు తినకూడదు. తింటే మ్యూకస్ ఉత్పత్తి పెరిగి శ్వాసకోస సమస్యలు వస్తాయి. టీ, కాఫీలో ఉండే కెఫీన్ నిద్రకు భంగం కలిగిస్తుంది. తీపి పదార్ధాలు తినకూడదు. మద్యం కూడా సేవించకూడదు. మాంసాహారం శరీరంలో సరిగ్గా జీర్ణం కాదు. దీంతో అజీర్తి, గ్యాస్, విరేచనాలు అవుతాయి.
Similar News
News July 5, 2025
ఆ 11 మంది ఏమయ్యారు?

TG: పాశమైలారం సిగాచీ కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదంలో 11 మంది ఆచూకీ లభించడంలేదు. 39 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించగా, కనిపించకుండా పోయినవారి శరీర భాగాల్లో చిన్న ముక్క కూడా దొరకలేదు. దీంతో వారు కాలి బూడిదయ్యారా? లేక ఏమయ్యారు? అనేది తెలియడంలేదు. వారి అవశేషాల కోసం ఘటనాస్థలంలో మరోసారి వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో బాధిత కుటుంబీకులకు ఏం చెప్పాలో తెలియక అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.
News July 5, 2025
గుడ్న్యూస్.. సగానికి తగ్గనున్న టోల్ ఫీజ్!

కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల ఫీజు నిబంధనల్లో చేసిన మార్పుల కారణంగా త్వరలో టోల్ ఛార్జీలు తగ్గే అవకాశముంది. 2008లో టోల్ ప్లాజాలకు సంబంధించి నిర్ణయించిన యూజర్ ఛార్జీలను తాజాగా సవరించింది. కొత్త రూల్స్ ప్రకారం సొరంగాలు, బ్రిడ్జిలు ఉన్న జాతీయ మార్గాల్లో టోల్ ఫీజ్ లెక్కింపు పద్ధతి మారనుంది. ఈ క్రమంలో దాదాపు సగం వరకు ఛార్జీ తగ్గే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీంతో వాహనదారులకు మేలు జరగనుంది.
News July 5, 2025
సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ కోచ్ల పెంపు

సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగించే వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో 4 చొప్పున కోచ్లు పెంచినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రస్తుతం ఏసీ ఛైర్ కార్ కోచ్లు 14 ఉండగా వాటిని 18 చేసింది. సికింద్రాబాద్ నుంచి ఉ.5.05 గంటలకు బయల్దేరే వందేభారత్(20707) మ.1.50 గంటలకు విశాఖ చేరుకుంటుంది. మళ్లీ అక్కడి నుంచి మ.2.30 గంటలకు బయల్దేరే ట్రైన్(20708) రా.11 గంటలకు సికింద్రాబాద్కు వస్తుంది.