News March 2, 2025

సంగారెడ్డి: ఉపరాష్ట్రపతి పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత: ఎస్పీ

image

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ కందిలోని ఐఐటి-హైదరాబాద్ పర్యటన సందర్భంగా 550 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఐఐటి వద్ద బందోబస్తుకు వచ్చిన అధికారులతో ఏర్పాటు చేసిన బ్రీఫింగ్ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడారు. ఉపరాష్ట్రపతి పర్యటన సందర్భంగా జిల్లా సివిల్, సాయుధ బలగాలు, బాంబు డిస్పోజల్ టీమ్స్ పని చేస్తాయన్నారు.

Similar News

News November 3, 2025

SRCL: పెద్దింటి అశోక్‌ కుమార్‌కు జీవన సాఫల్య పురస్కారం

image

సిరిసిల్ల పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, సినీ గేయ రచయిత అయిన పెద్దింటి అశోక్‌ కుమార్‌కు ‘అమృత లత జీవన సాఫల్య పురస్కారం-2025’ లభించింది. నిజామాబాద్‌లోని అపురూప అవార్డు బృందం వారు ఆదివారం ఈ పురస్కారాన్ని ఆయనకు అందజేశారు. ఆయన సాహిత్యంపై ఇప్పటివరకు వివిధ యూనివర్సిటీల నుంచి ఐదు ఎంఫిల్, నాలుగు పీహెచ్‌డీ పట్టాలు రావడం విశేషం.

News November 3, 2025

సీఏ ఫలితాలు విడుదల

image

సీఏ(ఛార్టర్డ్ అకౌంటెన్సీ)-2025 ఫలితాలు విడుదలయ్యాయి. సీఏ ఫౌండేషన్, ఇంటర్మీడియెట్, ఫైనల్ రిజల్ట్స్ ICAI వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు తమ రోల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసి రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. సెప్టెంబర్ నెలలో ఈ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.
వెబ్‌సైట్: <>https://icai.nic.in/caresult/<<>>

News November 3, 2025

అచ్చంపేట: రేషన్ గోదాంలో 257 క్వింటాళ్ల దొడ్డు బియ్యం

image

2024 ఏప్రిల్ నుంచి రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. నిల్వ ఉన్న దొడ్డు బియ్యం గురించి సివిల్ సప్లై అధికారులు నిర్లక్ష్యం చేశారు. దీంతో అచ్చంపేట పట్టణంలోని సివిల్ సప్లై గోదాంలో 257 క్వింటాళ్ల దొడ్డు రేషన్ బియ్యం ఏడాది కాలంగా తుట్టెలు కట్టి, పురుగులు పట్టీ ముక్కి పోతున్నాయి. అదే గోదాంలలో నిల్వ ఉన్న సన్న బియ్యనికి కూడ పురుగులు పడుతున్నాయి.