News March 2, 2025

ప్రతాపగిరి అడవుల్లో పులి పాదముద్రలు

image

కాటారం, మహాదేవపూర్ మండలాల్లో సంచరించిన పెద్దపులి పాదముద్రలను అధికారులు శనివారం కనుగొన్నారు. మండలంలోని ప్రతాపగిరి అడవుల్లో పెద్దపులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు శనివారం గుర్తించారు. అటవీ సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. దీంతో అటవీ సమీప గ్రామాలు పెద్ద పులి భయంతో బెంబేలెత్తిపోతున్నాయి.

Similar News

News January 20, 2026

ఆసిఫాబాద్: పోడు భూముల్లో ‘ఫారెస్ట్ హద్దులు’

image

దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న రిజర్వ్ ఫారెస్ట్ భూముల్లో అటవీ శాఖ అధికారులు ఎర్ర జెండాలను పాతి హద్దులను ఏర్పాటు చేశారు. దీంతో దహేగాం మండలంలోని పోలంపల్లి, మురళిగూడ, ఐసం, పార్వతిపేట, బొప్పారం, పెసరకుంట, బిబ్ర తదితర గ్రామాలకు చెందిన సుమారు 1000 ఎకరాల పైచిలుకు భూమి ఫారెస్ట్ హద్దుల్లోకి వెళ్లిపోనుంది. దీంతో భూమే జీవనాధారంగా బతికే బాధిత కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

News January 20, 2026

అల్లూరి: ఏజెన్సీలో మొదలైన అడ్డ పిక్కల సీజన్

image

అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో అడ్డ పిక్కల సీజన్ మొదలైంది. అడవుల్లో సహజంగా విరివిగా లభించే ఈ పిక్కలను గిరిజనులు సేకరించి ఆహారంగా వినియోగిస్తారు. అడవుల్లో లభించే పచ్చి పిక్కలను కొందరు నేరుగా తినగా, మరికొందరు వంటల రూపంలో వాడుతున్నారు. వీటిని తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయని గిరిజనులు చెబుతున్నారు. వీటిని స్థానిక వారపు సంతల్లో కూడా విక్రయిస్తారు.

News January 20, 2026

ఇంధన భద్రత దిశగా భారత్ కీలక అడుగు

image

విదేశీ గడ్డపై భారత్ చమురు వేట ఫలించింది. అబుదాబీలో భారీగా ముడి చమురు నిక్షేపాలు దొరకడం మన ‘ఇంధన భద్రత’ దిశగా కీలక అడుగు. క్రూడాయిల్ కోసం విదేశాలపై ఆధారపడే మనకు అక్కడ సొంతంగా నిక్షేపాలు ఉండటం పెద్ద ప్లస్ పాయింట్. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రో రిసోర్సెస్ జాయింట్ వెంచర్ సాధించిన ఈ విజయం అంతర్జాతీయంగా మన దేశ శక్తిని పెంచడమే కాకుండా భవిష్యత్తులో ఇంధన కొరత లేకుండా దేశాన్ని మరింత బలోపేతం చేయనుంది.