News March 2, 2025
టీమ్‌ఇండియా కోసం జట్లన్నీ దుబాయ్‌లోనే

CTలో భారత మ్యాచులు ఇతర జట్లకు తలనొప్పిగా మారాయి. ఇప్పటికే టీమ్‌ఇండియా సెమీస్‌కు చేరుకున్నా ఏ జట్టుతో ఆడాలో ఇంకా క్లారిటీ రాలేదు. ఈ క్రమంలో ప్రాక్టీస్ చేసేందుకు AUS పాక్ నుంచి దుబాయ్‌కు చేరుకోగా SAనూ ఇక్కడికి రప్పిస్తున్నారు. ఇవాళ్టి మ్యాచ్ కోసం NZ దుబాయ్‌లోనే ఉంది. కివీస్‌పై గెలిస్తే గ్రూప్-ఏలో భారత్ టాప్‌లో నిలిచి గ్రూప్-బిలో రెండోస్థానంలో ఉన్న ఆసీస్‌తో, ఓడితే దక్షిణాఫ్రికాతో తలపడనుంది.
Similar News
News February 9, 2026
T20 WC: అత్యధిక వికెట్లు తీసింది వీరే..

T20WCలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో బంగ్లాదేశ్ ప్లేయర్ షకీబ్(50) తొలి స్థానంలో ఉన్నారు. నిన్న ఐర్లాండ్‌తో మ్యాచులో 3 వికెట్లు తీసిన హసరంగ(40*) తర్వాతి స్థానంలో ఉన్నారు. అఫ్రీది(39), మలింగ(38), రషీద్(38*), జంపా(36), అజ్మల్(36), సౌథీ(36), నోర్ట్జే(35), మెండిస్(35) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. భారత్ నుంచి అశ్విన్(32), అర్ష్‌దీప్(29), బుమ్రా(26) టాప్ వికెట్ టేకర్లుగా ఉన్నారు.
News February 9, 2026
4/800 మార్కులు.. అయినా..

NEET-PG <<18852584>>కటాఫ్<<>>ను ప్రభుత్వం భారీగా తగ్గించడంతో సింగిల్ డిజిట్ మార్కులు వచ్చిన వారికీ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్లు లభిస్తున్నాయి. రోహ్‌తక్‌లోని ఓ కాలేజీలో ఆర్థోపెడిక్స్ సీటు 800కిగానూ 4 మార్కులకు, ఢిల్లీలోని టాప్ కాలేజీలో గైనకాలజీ సీటు 44mrksకు దక్కడం గమనార్హం. ఇంత తక్కువ మెరిట్ ఉన్నా సీట్లు ఇవ్వడంపై సుప్రీంకోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
News February 9, 2026
స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టే యోచన

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు సభ్యులు నిరసన చేపట్టడంతో స్పీకర్ సభను మ.12 గంటలకు వాయిదా వేశారు.


