News March 2, 2025

పదో తరగతి విద్యార్థులకు కలెక్టర్ ‘విజయోస్తు’ లేఖ

image

ఈనెల 21 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షకు ప్రారంభం కానున్న నేపథ్యంలో జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా స్వయంగా లిఖించి ముద్రించిన ‘ విజయోస్తు ‘ లేఖలను విద్యార్థులకు అందిస్తున్నారు. పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు కావాల్సిన పంచసూత్రాలను పాటిస్తూ చదవాలని లేఖలో పొందుపరిచారు. జిల్లాలోని ప్రతి విద్యార్థికి ఈ లేఖలను కలెక్టర్ అందించి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.

Similar News

News November 14, 2025

జూబ్లీహిల్స్ కౌంటింగ్: అభ్యర్థి మృతి

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ వేళ విషాదం నెలకొంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ అన్వర్(40) నిన్న రాత్రి గుండెపోటుతో మరణించారు. ఎర్రగడ్డలో నివాసం ఉండే ఈయన అక్టోబర్ 22న నామినేషన్ వేశారు. ఎన్నికల అధికారులు ఆయన నామినేషన్‌ను యాక్సెప్ట్ చేయగా పోటీలో నిలిచారు. ఫలితాలకు ఒకరోజు ముందు మహమ్మద్ అన్వర్ మరణించడంతో ఆయన అనుచరులు విషాదంలో మునిగిపోయారు.

News November 14, 2025

జూబ్లీహిల్స్: సుమారు 75 శాతం పోలింగ్ నమోదైన బూత్‌లు నాలుగే!

image

జూబ్లీహిల్స్ బైపోల్ పోలింగ్ మొత్తం 407 బూత్‌లల్లో జరిగింది. కాగా ఇందులో 20-30 శాతం పోలింగ్ నమోదైన కేంద్రం 1 కాగా 71 కేంద్రాల్లో 31-40%, 143 కేంద్రాల్లో 41-50%, 158 కేంద్రాల్లో 51-60%, 30 కేంద్రాల్లో 61-70%, 4కేంద్రాల్లో 71-75% పోలింగ్ నమోదైంది. అయితే 60 శాతం కంటే ఎక్కువ పోలింగ్ నమోదైన 34కేంద్రాల్లో రహమత్‌నగర్ 16, బోరబండ 13, షేక్‌పేట్ 2, ఎర్రగడ్డ 3 ఉన్నాయి. వీటిల్లో 18చోట్ల మహిళలే అధికంగా ఓటేశారు.

News November 14, 2025

వరంగల్: కుడా భూముల వేలం వాయిదా

image

కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) భూముల వేలం ఈ నెల 14న నిర్వహించాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు కుడా వైస్‌ ఛైర్‌పర్సన్ చాహత్ బాజ్ పాయ్ తెలిపారు. హనుమకొండ బాలసముద్రంలోని సర్వే నం. 1016/5లోని 12,957 చదరపు గజాల ప్రభుత్వ స్థలం వేలం నిలిపివేశారు. కొత్త తేదీని తరువాత ప్రకటిస్తామని ఆమె స్పష్టం చేశారు.