News March 2, 2025

పకడ్బందీగా ఓట్ల లెక్కింపు: ఏలూరు కలెక్టర్

image

ఓట్ల లెక్కింపుపై పూర్తి అవగాహన చేసుకుని పారదర్శకతతో లెక్కింపు చేయాలని MLC ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి వెట్రిసెల్వి సిబ్బందిని ఆదేశించారు. సి.ఆర్.రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం సిబ్బందికి నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. సిబ్బంది 3వ తేదీ ఉ.6 గంటలకు హాజరు కావాలని ఆదేశించారు. ఉ.8గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. కాగా ఎవరు గెలుస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Similar News

News March 2, 2026

కువైట్‌లో పాలకొల్లు యువకుడి మృతి

image

పాలకొల్లు డామ్ పేటకు చెందిన కందికట్ల రాకేష్ (26) కువైట్ దేశంలో మృతి చెందారు. 8 నెలలు క్రితం కువైట్ వెళ్లిన రాకేష్ కూలి పనులకు వెళ్తుంటాడు. ఆదివారం అనారోగ్యంగా ఉండడంతో స్నేహితులు ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కువైట్‌లోనే ఉంటున్న రాకేష్ తల్లి రమణకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని స్వస్థలం వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తండ్రి శ్రీనివాస్ కోరుతున్నారు.

News March 2, 2026

అక్షరాంధ్ర పరీక్షలకు అంతా సిద్ధం కావాలి: కలెక్టర్‌

image

జిల్లాలో నిరక్షరాస్యతను నిర్మూలించేందుకు చేపట్టిన అక్షరాంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించే పరీక్షలకు రిజిస్టర్‌ అయిన వారందరూ హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. సోమవారం భీమవరం కలెక్టరేట్‌ నుంచి జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో ఆమె వెబ్‌ఎక్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. మూల్యాంకనకు సిబ్బందిని నియమించాలన్నారు.

News March 2, 2026

యథావిధిగా జిల్లాలో పీజీఆర్ఎస్: కలెక్టర్ నాగరాణి

image

భీమవరంలోని కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల కార్యాలయాల్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టరు నాగరాణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు అర్జీలు స్వీకరిస్తామన్నారు. నేరుగా రాలేని వారు 1100 కాల్ సెంటర్ లేదా వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని, అధికారులు అందుబాటులో ఉండాలని ఆమె ఆదేశించారు.