News March 2, 2025

విశాఖలో స్పా సెంటర్‌పై దాడి.. ఏడుగురి అరెస్ట్

image

విశాఖలోని సీతంపేట మార్గదర్శి ఆపోజిట్లో గల స్పా సెంటర్‌పై ద్వారక నగర్ పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నలుగురు మహిళలు, ముగ్గురు పురుషులను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా వ్యభిచారం చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఒక్కసారిగా స్పా సెంటర్‌లో దాడులతో మిగతా స్పా సెంటర్‌లలో అలజడి నెలకొంది. ద్వారక నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News January 27, 2026

భువనగిరి: తాటిచెట్టుపై నుండి పడి గీత కార్మికుడు మృతి

image

సుద్దాలలో మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. గీత కార్మికుడు యమగాని బక్కయ్య కల్లు గీయడానికి తాటిచెట్టు ఎక్కగా, ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడ్డారు. తీవ్ర గాయాలైన ఆయనను 108 వాహనంలో జనగామ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. బక్కయ్య మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

News January 27, 2026

కోనసీమలో ఖాకీల తనిఖీలు.. తల్లిదండ్రులకు వార్నింగ్!

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా SP రాహుల్ మీనా ఆదేశాల మేరకు సోమవారం జిల్లా వ్యాప్తంగా ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో SHOలు, సిబ్బంది ప్రధాన కూడళ్లలో తనిఖీలు చేపట్టారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా మైనర్ డ్రైవింగ్‌పై దృష్టి సారించి, వాహనాలు నడుపుతున్న బాలుర తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు.

News January 27, 2026

కోటప్పకొండ తిరుణాళ్ల.. వీఐపీ పాసులు రద్దు

image

మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా జరగనున్న కోటప్పకొండ తిరుణాలకు ఈ సంవత్సరం వీఐపీ పాసులు రద్దు చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. గత సంవత్సరం పదివేల వీఐపీ నకిలీ పాసులు కలకలం నేపథ్యంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. దీంతో ఈ సంవత్సరం వీఐపీ పాసుల స్థానంలో 500 రూపాయల ప్రత్యేక దర్శనం టోకెన్లు ఏర్పాటు చేయడం జరిగిందని అధికారులు వెల్లడించారు.