News March 2, 2025

VZM: ఇంటర్ పరీక్షలకు 702 మంది విద్యార్థులు గైర్హాజరు

image

విజయనగరం జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులు 702 మంది గైర్హాజరైనట్లు ఆర్ఐఓ ఆదినారాయణ చెప్పారు. జిల్లావ్యాప్తంగా 166 పరీక్షా కేంద్రాలలో 508 మంది ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు, 194మంది ఓకేషనల్ మొదటి సంవత్సరం విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారు. కొంతమంది విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో హాజరు కాకపోవడంతో గైర్హాజరు కాగా మరికొంతమంది వివిధ కారణాలతో హాజరు కాలేదు.

Similar News

News March 3, 2025

బొబ్బిలి రైల్వే స్టేషన్లో ప్రయాణికుల పడిగాపులు

image

బొబ్బిలి- డొంకినవలస మధ్యలో ఓ గూడ్స్ రైలు సాంకేతిక కారణాలతో సోమవారం నిలిచిపోయింది. ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో గూడ్స్ రైలు నిలిచిపోయినట్లు రైల్వే అధికారులు తెలిపారు. దీంతో రాయగడ- విజయనగరం మధ్య రైళ్లు స్తంభించాయి. విశాఖ-కొరాపుట్ పాసింజర్ ట్రైన్ బొబ్బిలి రైల్వే స్టేషన్లో గంటకు పైగా నిలిచిపోవడంతో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. విజయనగరం నుంచి మరో రైలింజన్‌ను తెప్పించే ఏర్పాట్లు చేశారు.

News March 3, 2025

VZM: ‘లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలి’

image

ఈనెల 8న జిల్లా వ్యాప్తంగా జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌ను చిట్స్,  ఫైనాన్స్ కంపెనీలు వినియోగించుకోవాలని 4వ అదనపు జిల్లా న్యాయమూర్తి అప్పలస్వామి సూచించారు. జిల్లా కోర్టు సముదాయంలో చిట్ ఫండ్ కంపెనీల ప్రతినిధులతో సోమవారం సమావేశం నిర్వహించారు. చిట్టీ కేసులకు సంబంధించి ఎక్కువ కేసులను రాజీ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజేష్ పాల్గొన్నారు.

News March 3, 2025

VZM: అధికారులతో కలెక్టర్ అంబేడ్కర్ సమీక్ష

image

విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ అంబేడ్కర్ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఈవోపీఆర్డీలతో సమీక్ష జరిపి ఆయా శాఖల పనితీరుపై ఆరా తీశారు. గ్రామాలు, పట్టణాల్లో తాగునీరు, ఉపాధి హామీ, ఎంఎస్ఎంఈ సర్వే, తదితర అంశాలపై చర్చించారు. వేసవిలో తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని ఆదేశించారు.

error: Content is protected !!