News March 2, 2025

KMR: నేటి నుంచి ఉపవాస దీక్షలు షురూ..

image

ముస్లింలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పరమ పవిత్ర రంజాన్‌ మాసం రానేవచ్చింది. నెలవంక శనివారం కనిపించడంతో ఆ రాత్రి ప్రత్యేక తరావీహ్ నమాజ్‌తో పవిత్ర రంజాన్ మాసాన్ని స్వాగతం పలికారు ముస్లిం సోదరులు. ఆదివారం తెల్ల వారు జామున ‘సహేర్’ (భోజనం ఆరగించి) ఉపవాస దీక్షలు చేపట్టారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా.. కామారెడ్డి జిల్లాలో ఇప్పటికే అన్ని మసీదులు ముస్తాబయ్యాయి.

Similar News

News November 9, 2025

ఓటుకు రూ.7వేలు ఇస్తున్నారు: బండి సంజయ్

image

TG: కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. అభివృద్ధి కావాలో, అరాచకం కావాలో జూబ్లీహిల్స్ ప్రజలు తేల్చుకోవాలన్నారు. ప్రజలను ప్రలోభ పెట్టేందుకు కాంగ్రెస్ రూ.5వేలు, BRS రూ.7వేలు ఇస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఇప్పటికే KCR మెడలను వంచామని, కాంగ్రెస్ మెడలూ BJP వంచుతుందని వ్యాఖ్యానించారు. హిందువుల దమ్మేంటో జూబ్లీహిల్స్ ప్రజలు చూపించాలన్నారు.

News November 9, 2025

SKLM: ‘ఈనెల 11న జాతీయ విద్యా దినోత్సవ వేడుకలు’

image

జాతీయ విద్య దినోత్సవ వేడుకలు శ్రీకాకుళం కలెక్టర్ సమావేశ మందిరంలో ఈనెల 11న నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశ తొలి విద్యాశాఖ మంత్రి, ‘భారత రత్న’ జనాబ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ 138వ జయంతిని పురస్కరించుకుని జరపనున్న కార్యక్రమంలో అధికారులు పాల్గొని జయప్రదం చేయాలన్నారు.

News November 9, 2025

రేవంత్ ‘ముస్లిం’ వ్యాఖ్యలపై మండిపడ్డ రాజ్‌నాథ్

image

TG సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. ‘<<18211719>>కాంగ్రెస్ అంటే ముస్లింలు<<>>.. ముస్లింలంటే కాంగ్రెస్ అని రెండుమూడు రోజుల కిందట TG సీఎం అన్నారు. రాజకీయాల్లో ఇంకా ఎంత వరకు దిగజారాలని కాంగ్రెస్ కోరుకుంటోంది?’ అని ప్రశ్నించారు. ముస్లిం సోదరులను రెచ్చగొడుతున్నారని, దీనిపై వారు తీవ్రంగా ఆలోచించాలని కోరారు. దేశంలో అభివృద్ధి చేయగలిగేది NDA మాత్రమేనని చెప్పారు.