News March 2, 2025
కమలాపూర్: రూ.9,51,000ల సైబర్ మోసం

సైబర్ నేరగాళ్ల వలలో పడి ఓ వ్యక్తి రూ.9,51,000 పోగొట్టుకున్న ఘటన కమలాపూర్ మండలంలో చోటుచేసుకుంది. సీఐ హరికృష్ణ కథనం ప్రకారం.. శనిగరం గ్రామానికి చెందిన మనోజ్‌కు టెలిగ్రామ్ ద్వారా బావి జోషి అనే అడ్రస్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. టాస్క్ ఆడితే డబ్బులు రెట్టింపు అవుతాయని తెలుపగా విడతల వారీగా రూ.9.51లక్షలు వేశారు. ఎంతకూ నగదు రెట్టింపు కాకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News January 13, 2026
తిరుపతి: భార్య పోలీస్.. భర్త దొంగ!

నెల్లూరులో కార్ల <<18838353>>దొంగతనం <<>>వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తిరుపతిలోని ఓ కారు షోరూమ్‌లో పనిచేసే లక్ష్మణ్ కుమార్, కారు మెకానిక్ శివ(నెల్లూరు బీవీనగర్), A1 నిందితుడు ఫ్రెండ్స్. ఢిల్లీ, ముంబయిలో A1 కార్లు చోరీ చేసి నెల్లూరుకు తెస్తే ఈ ఇద్దరూ AP, TS నంబర్ ప్లేట్లు మార్చి తక్కువ రేటుకు అమ్మేస్తున్నారు. A1 నెల్లూరుకు చెందిన ఓ లేడీ కానిస్టేబుల్ భర్త అని.. అతనిపై చాలా కేసులు ఉన్నట్లు సమాచారం.
News January 13, 2026
ఎస్సీ కార్పొరేషన్ రుణగ్రహీతలకు ఊరట: కలెక్టర్

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలు రుణమాఫీ వర్తిస్తుందని జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా తెలిపారు. 2015 నుంచి 2019 వరకు NSFDC, NS KFDC పథకాల కింద స్వయంఉపాధి కోసం రుణాలు పొందిన లబ్ధిదారులకు వడ్డీ మాఫీకి ప్రభుత్వం అవకాశం కల్పించిందని అన్నారు. ఏడాది ఏప్రిల్ 30వ తేదీ లోపు మొత్తం చెల్లించిన వారికి వడ్డీ మాఫీ చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసిందని చెప్పారు.
News January 13, 2026
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం.. 10 మందికి మెమోలు

అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించిన 10 మంది అధికారులకు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మెమోలు జారీ చేశారు. సోమవారం PGRSలో అర్జీలపై సమీక్షించారు. టౌన్‌ప్లానింగ్, హౌసింగ్ విభాగాల్లో తూతూమంత్రంగా ఎండార్స్‌మెంట్లు ఇస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2, 4, 5, 6, 8వ జోన్‌లలో సంబంధిత కమిషనర్‌లకు, టౌన్‌ప్లానింగ్, DE, ASOలకు మెమోలు జారీశారు. దీనిపై వివరణ ఇవ్వాలని నోడల్ అధికారి శేషశైలజను ఆదేశించారు.


