News March 2, 2025
ఎస్.కోటలో యాక్సిడెంట్.. ఒకరి మృతి

ఎస్.కోటలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. CI నారాయణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. సీతంపేటకి చెందిన నాగభూషణం(58) ఎస్.కోట రైతు బజారు ముందు నడుచుకుంటూ వెళ్తుండగా ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొట్టింది. స్థానికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతుడి భార్య విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News March 3, 2025
బొబ్బిలి రైల్వే స్టేషన్లో ప్రయాణికుల పడిగాపులు

బొబ్బిలి- డొంకినవలస మధ్యలో ఓ గూడ్స్ రైలు సాంకేతిక కారణాలతో సోమవారం నిలిచిపోయింది. ఇంజిన్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో గూడ్స్ రైలు నిలిచిపోయినట్లు రైల్వే అధికారులు తెలిపారు. దీంతో రాయగడ- విజయనగరం మధ్య రైళ్లు స్తంభించాయి. విశాఖ-కొరాపుట్ పాసింజర్ ట్రైన్ బొబ్బిలి రైల్వే స్టేషన్లో గంటకు పైగా నిలిచిపోవడంతో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. విజయనగరం నుంచి మరో రైలింజన్ను తెప్పించే ఏర్పాట్లు చేశారు.
News March 3, 2025
VZM: ‘లోక్ అదాలత్ను వినియోగించుకోవాలి’

ఈనెల 8న జిల్లా వ్యాప్తంగా జరగనున్న జాతీయ లోక్ అదాలత్ను చిట్స్, ఫైనాన్స్ కంపెనీలు వినియోగించుకోవాలని 4వ అదనపు జిల్లా న్యాయమూర్తి అప్పలస్వామి సూచించారు. జిల్లా కోర్టు సముదాయంలో చిట్ ఫండ్ కంపెనీల ప్రతినిధులతో సోమవారం సమావేశం నిర్వహించారు. చిట్టీ కేసులకు సంబంధించి ఎక్కువ కేసులను రాజీ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజేష్ పాల్గొన్నారు.
News March 3, 2025
VZM: అధికారులతో కలెక్టర్ అంబేడ్కర్ సమీక్ష

విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ అంబేడ్కర్ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఈవోపీఆర్డీలతో సమీక్ష జరిపి ఆయా శాఖల పనితీరుపై ఆరా తీశారు. గ్రామాలు, పట్టణాల్లో తాగునీరు, ఉపాధి హామీ, ఎంఎస్ఎంఈ సర్వే, తదితర అంశాలపై చర్చించారు. వేసవిలో తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని ఆదేశించారు.