News March 22, 2024
కాళేశ్వరంపై కొనసాగుతోన్న NDSA విచారణ
TG: కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణాలపై NDSA బృందం విచారణ కొనసాగుతోంది. బ్యారేజీ నిర్మాణాల్లో లోపాలతో పాటు పలు అంశాలపై సంబంధిత అధికారులను చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని కమిటీ గత 2 రోజులుగా విచారిస్తోంది. బ్యారేజీల డిజైన్లలో తేడాలెందుకు ఉన్నాయని, పనుల ప్రారంభానికి ముందు భూగర్భ పరీక్షల్లో ఏమేం గుర్తించారని ప్రశ్నించింది. ఇవాళ చివరి రోజు రాష్ట్ర డ్యామ్ కమిటీతో భేటీ కానుంది.
Similar News
News January 9, 2025
పిల్లలకు జన్మనిస్తే రూ.81,000.. యువతులకు ఆఫర్
రష్యాలో గత ఏడాది జననాలు తగ్గడంతో ఆ దేశంలోని కరేలియా యంత్రాంగం సంచలన ప్రకటన చేసింది. 25 ఏళ్ల లోపు యువతులు ఆరోగ్యకరమైన చిన్నారులకు జన్మనిస్తే రూ.81,000 ఇస్తామని ప్రకటించింది. కరేలియాకు చెందిన వారై స్థానికంగా చదివేవారిని అర్హులుగా పేర్కొంది. అయితే ఇప్పటికే పిల్లలున్న వారికి ఇది వర్తించదని తెలిపింది. ఇతర ప్రాంతాలు ఇదే విధానాన్ని అనుసరించే యోచనలో ఉన్నాయి.
News January 9, 2025
అధికారుల సేవ TTD కంటే TDPకే ఎక్కువ: అంబటి
AP: చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తిరుపతిలో ఘోరం జరిగిందని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. ‘అధికారులు టీటీడీ కంటే టీడీపీకే ఎక్కువ సేవ చేస్తున్నారు. ఆఫీసర్లపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసి ఏం సాధించారు? అధికారులను తిడితే సమస్యలు పరిష్కారమవుతాయా? ఇదే నిర్లక్ష్యం కొనసాగితే మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. క్షతగాత్రులకు ఒక్కొక్కరికి రూ.25 లక్షలు ఇవ్వాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.
News January 9, 2025
గతంలోలాగే ఏర్పాట్లు.. ఈవోపై సీఎం ఫైర్
AP: టోకెన్ల జారీ కేంద్రాల వద్ద ఏర్పాట్లపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో లాగే ఇప్పుడు కూడా ఏర్పాట్లు చేశామన్న టీటీడీ ఈవో శ్యామల రావు వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘ఎవరో చేశారని నువ్వు అలానే చేస్తావా? నీకంటూ కొత్త ఆలోచనలు లేవా?’ అంటూ ప్రశ్నించారు. సాంకేతికతను ఎందుకు వాడుకోలేదని ఈవోను నిలదీశారు.