News March 2, 2025

వరంగల్: అతిపెద్ద రన్‌‌ వే ఉన్న ఎయిర్‌పోర్ట్ మనదే!

image

మామునూర్ విమానాశ్రయాన్ని చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ వ్యాపారాల కోసం 1930లో నిర్మించారు. నిజాం కాలంలో దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద రన్‌ వే కలిగిన ఎయిర్‌పోర్ట్ కూడా మనదే. చైనాతో యుద్దం సమయంలోనూ మన ఎయిర్‌‌పోర్ట్ సేవలందించింది. మాజీ ప్రధాని నెహ్రూ సైతం ఓసారి ఈ ఎయిర్‌పోర్టులో దిగారు. మరి ఎయిర్‌పోర్ట్‌కు ఏ పేరు పెట్టాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Similar News

News December 29, 2025

కర్నూలు: ‘నిరుద్యోగులు పేర్లు నమోదు చేసుకోవాలి’

image

పదో తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన నిరుద్యోగ యువత www.ncs.gov.in వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనాధికారిణి దీప్తి సూచించారు. మొబైల్ నంబర్, ఆధార్, మెయిల్ ఐడీతో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం, కెరీర్ మార్గదర్శనం, జాబ్ మేళాల వివరాలు తెలుసుకోవచ్చన్నారు. సందేహాలుంటే జిల్లా ఉపాధి కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. యువత సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

News December 29, 2025

స్టార్స్‌కి కాదు.. స్టోరీకే ప్రేక్షకుల జై!

image

ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కొన్ని చిన్న సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. ముఖ్యంగా ‘కోర్టు’ మూవీని రూ.5కోట్లతో తీస్తే రూ.55కోట్లు వచ్చాయి. 8 వసంతాలు, మ్యాడ్ స్క్వేర్, అరి మూవీస్ ఆకట్టుకున్నాయి. ఈవారం విడుదలైన శంబాల, దండోరా సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకొని.. కంటెంట్‌కే ప్రేక్షకులు పట్టం కడతారని మరోసారి రుజువు చేశాయి. 2025లో రిలీజైన సినిమాల్లో మీకు నచ్చినదేంటో కామెంట్ చేయండి.

News December 29, 2025

న్యూ ఇయర్ వేడుకలపై విజయవాడ పోలీసుల ఆంక్షలు

image

న్యూ ఇయర్ వేడుకలు కేవలం ఆమోదయోగ్యంగా, ఆహ్లాదకరంగా మాత్రమే జరుపుకోవాలని విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు స్పష్టం చేశారు. డిసెంబర్ 31 రాత్రి బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు, బీఆర్టీఎస్ రోడ్లపై ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. అతివేగం, డ్రంక్ అండ్ డ్రైవ్ పై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు.