News March 2, 2025
మెదక్: గెలుపుపై ఎవరి అంచనాలు వారివే.!

ఉమ్మడి KNR, MDK, NZB, ADB పట్టభద్రుల, ఉపాధ్యాయ MLC ఎన్నికల ఫలితాలపై ఆయా పార్టీనేతల్లో ఉత్కంఠ నెలకొంది. పార్టీ శ్రేణులతో కలిసి పోలింగ్ కేంద్రాల వారీగా ప్లస్, మైనస్‌లపై విశ్లేషిస్తున్నారు. పోలింగ్ శాతం పెరగడం, తదితర అంచనాలతో గెలుపుపై ఎవరికి వారు ధీమాతో ఉన్నారు. ఈ ఫలితాలు వచ్చే స్థానిక ఎన్నికలపై ప్రభావం చూపనుండటంతో విద్యావంతుల తీర్పుపై రాజకీయపార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. రేపు గెలువు ఎవరిదో తేలనుంది.
Similar News
News January 14, 2026
కైలాస వాహనంపై ఆది దంపతులు

శ్రీశైలం క్షేత్రంలో కొలువైన శ్రీ భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి దంపతులు సంక్రాంతి ఉత్సవాలు పురస్కరించుకుని బుధవారం రాత్రి కైలాస వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అర్చకులు, పండితులు ముందుగా స్వామి, అమ్మ వారిని విశేషంగా అలంకరించి కైలాస వాహనంపై కొలువు తీర్చి గ్రామోత్సవం చేపట్టగా వేలాది భక్తులు దర్శించుకున్నారు.
News January 14, 2026
మిడిల్ ఈస్ట్‌లో టెన్షన్ టెన్షన్.. ఇరాన్ హెచ్చరికతో..

మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. తమ దేశంపై అమెరికా స్ట్రైక్ చేస్తే మిడిల్ ఈస్ట్‌లోని US మిలిటరీ బేస్‌లపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. దీంతో ఖతర్‌లోని అల్ ఉదీద్ ఎయిర్ బేస్ నుంచి తమ సైనిక బలగాలను అమెరికా వెనక్కి పిలిచింది. ముందు జాగ్రత్తగానే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. కాగా మిడిల్ ఈస్ట్‌లో USకు ఇదే అతిపెద్ద మిలిటరీ బేస్. ఇందులో 10వేలకు పైగా అమెరికా సైనికులు ఉంటారు.
News January 14, 2026
గొల్లపల్లి: గంజాయి తరలిస్తున్న యువకుడిపై కేసు

గొల్లపల్లి మండలం చందోలి గ్రామ శివారులో తనిఖీలు నిర్వహిస్తుండగా గంజాయి తరలిస్తున్న బచ్చల రామ్ చరణ్ పట్టుబడగా కేసు నమోదు చేసినట్లు గొల్లపల్లి ఎస్సై కృష్ణ సాగర్ రెడ్డి తెలిపారు. దీంతో రామ్ చరణ్‌ను అదుపులోకి తీసుకొని, అతని నుంచి 89 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. యువత చెడు వ్యసనాలకు బానిస కావద్దని, గంజాయి వాడినా, విక్రయించిన చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు.


