News March 2, 2025
మెదక్: గెలుపుపై ఎవరి అంచనాలు వారివే.!

ఉమ్మడి KNR, MDK, NZB, ADB పట్టభద్రుల, ఉపాధ్యాయ MLC ఎన్నికల ఫలితాలపై ఆయా పార్టీనేతల్లో ఉత్కంఠ నెలకొంది. పార్టీ శ్రేణులతో కలిసి పోలింగ్ కేంద్రాల వారీగా ప్లస్, మైనస్‌లపై విశ్లేషిస్తున్నారు. పోలింగ్ శాతం పెరగడం, తదితర అంచనాలతో గెలుపుపై ఎవరికి వారు ధీమాతో ఉన్నారు. ఈ ఫలితాలు వచ్చే స్థానిక ఎన్నికలపై ప్రభావం చూపనుండటంతో విద్యావంతుల తీర్పుపై రాజకీయపార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. రేపు గెలువు ఎవరిదో తేలనుంది.
Similar News
News March 3, 2025
కుంభమేళా పూర్తయ్యింది.. ప్రయాగ్‌రాజ్ పరిస్థితి ఇదీ

కుంభమేళా ముగిసి రోజులు గడుస్తున్నాయి. ఎటు చూసినా భక్తజనం, భగవన్నామస్మరణం, వ్యాపారాలు, రంగులతో 2నెలల పాటు సందడిగా కళకళలాడిన ప్రయాగ్‌రాజ్‌లో నేడు నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. శుభ్రం చేసేందుకు చెమటోడుస్తున్న పారిశుద్ధ్య కార్మికులు మాత్రమే కనిపిస్తున్నారు. అక్కడ సేకరించిన చెత్తనంతా రీసైక్లింగ్ ప్లాంట్‌కు తరలించనున్నట్లు UP ప్రకటించింది. ప్రయాగ పరిస్థితిని పైన ఫొటోల్లో చూడొచ్చు.
News March 3, 2025
వరంగల్: MLC ఎన్నికలు.. మొదటి రౌండ్ ఫలితాలు

WGL-KMM-NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు ఫలితాలను అధికారులు వెల్లడించారు.
1) PRTU అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి – 6,035
2) UTF అభ్యర్థి నర్సిరెడ్డి – 4,820
3) స్వతంత్ర అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి- 4,437
4) స్వతంత్ర అభ్యర్థి పూల రవీందర్- 3,115
5) BJP మద్దతు అభ్యర్థి సరోత్తంరెడ్డి- 2,289
కాగా మొత్తం 19 మంది అభ్యర్థులకు చెల్లిన ఓట్లు 23,641, చెల్లని ఓట్లు 494