News March 22, 2024

ఎమ్మెల్సీ కవిత పిటిషన్.. ఈడీకి సుప్రీంకోర్టు నోటీసులు

image

TG: ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌లోని అంశాలపై ఈడీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. బెయిల్‌పై ట్రయల్ కోర్టుకు వెళ్లాలని కవిత తరఫు న్యాయవాదులకు సూచించింది. బెయిల్ పిటిషన్‌పై జాప్యం లేకుండా విచారణ జరపాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది.

Similar News

News October 2, 2024

మినీ ఇండస్ట్రియల్ పార్కులకు భూ సేకరణ చేపట్టాలి: మంత్రి

image

TG: స్వయం సహాయక బృందాల కోసం ప్రభుత్వం మినీ ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయనుంది. వీటి కోసం ఒక్కో నియోజకవర్గంలో 2-3 ఎకరాల భూమి సేకరించాలని అధికారులను మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. ఒక్కో పార్కులో రెండంతస్తుల భవనాలను నిర్మించాలన్నారు. ప్రస్తుతం ఉన్న 65 లక్షల SHGలను 75 లక్షలకు పెంచాలని సూచించారు.

News October 2, 2024

‘ఆరోగ్యమే మహాభాగ్యం’.. గాంధీ ఆరోగ్య రహస్యాలివే!

image

గాంధీజీ ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు. రోజువారీ ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండేలా చూసుకునేవారు. ప్రొటీన్లు, విటమిన్లు అధికంగా ఉండే దంపుడు బియ్యాన్ని మాత్రమే తినేవారు. సేంద్రియ పద్ధతుల్లో పండించిన కూరగాయలనే ఇష్టపడేవారు. చక్కెరను పక్కనబెట్టి బెల్లం టీ తాగేవారు. రోజూ 15 కి.మీ నడవడంతో పాటు ప్రాణాయామం, వ్యాయామాలు చేసేవారు. ధూమపానం, మద్యపానం, మాంసాహారానికి బాపూజీ దూరం.

News October 2, 2024

ఇజ్రాయెల్‌కు అమెరికా సపోర్ట్.. కారణాలివే!

image

చాలా ఏళ్లుగా ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతుగా ఉంటోంది. 1948లో తొలిసారిగా ఇజ్రాయెల్‌ను ప్రత్యేక దేశంగా గుర్తించింది అమెరికానే. 1967లో పశ్చిమాసియాపై రష్యా ఆధిపత్యం పెరిగిపోకుండా ఇజ్రాయెల్ అడ్డుకుంది. దీంతో అమెరికా దృష్టిని ఇజ్రాయెల్ ఆకర్షించింది. మిడిల్ ఈస్ట్‌పై పట్టుకు ఇజ్రాయెల్ తమకు ఉపయోగపడుతుందని స్నేహబంధం కొనసాగిస్తూ వస్తోంది. అలాగే అమెరికాలో యూధులు రాజకీయంగా చాలా ప్రభావం చూపగలరు.