News March 22, 2024
హిందూపురం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బీకే పార్థసారథి
హిందూపురం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కురవ సామాజిక వర్గానికి చెందిన బీకే పార్థసారథి పేరును పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. ఆయన 1996లో ఉమ్మడి అనంత జడ్పీ ఛైర్మన్గా, 1999లో హిందూపురం ఎంపీగా, 2009, 2014లలో వరసగా పెనుకొండ ఎమ్యెల్యేగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మాలగుండ్ల శంకర నారయణ చేతిలో ఓడిపోయారు.
Similar News
News January 23, 2025
పశు ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్
శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఈనెల 31వ తేదీ వరకు నిర్వహించే పశు ఆరోగ్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లో పశు ఆరోగ్య శిబిరాలకు సంబంధించిన పోస్టర్లను సంబంధిత అధికారులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. జిల్లాలోని 32 మండలాల్లో మండలానికి ఒక వైద్య శిబిరరం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
News January 22, 2025
హలో అనంతపూర్.. వచ్చేస్తున్నాం: బాబీ
అనంతపురంలో ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి ‘డాకు మహారాజ్’ విజయోత్సవ పండుగ జరగనుది. ఈ వేడుకకు చిత్ర యూనిట్ తరలివస్తోంది. ఈ క్రమంలో హలో అనంతపూర్.. అంటూ డైరెక్టర్ బాబీ ట్వీట్ చేశారు. ‘డాకు మహారాజ్ విజయోత్సవ పండుగకి వచ్చేస్తున్నాం. ఈ సాయంత్రం అంతా కలుద్దాం’ అని పోస్ట్ పెట్టారు. ఆయనతో పాటు బాలకృష్ణ, ప్రగ్యాజైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశీ రౌతేలా, తమన్, నిర్మాత నాగ వంశీ, సినీ ప్రముఖులు రానున్నారు.
News January 22, 2025
అనంతపురానికి తారల రాక
అనంతపురంలో నేడు ‘డాకు మహారాజ్’ మూవీ <<15219121>>టీమ్<<>> సందడి చేయనుంది. నగరంలోని శ్రీనగర్ కాలనీ సమీపంలో సాయంత్రం జరగనున్న విజయోత్సవ వేడుకకు సినీ తారలు తరలిరానున్నారు. హీరో బాలకృష్ణ, కథానాయికలు ప్రగ్యాజైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, గ్లామర్ రోల్లో కనిపించిన ఊర్వశి రౌతేలా, దర్శకుడు బాబీ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, నిర్మాత నాగ వంశీ తదితరులు సందడి చేయనున్నారు. మరోవైపు పాసులు ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తారు.