News March 2, 2025
HYD: వాహనం నంబరు కనిపించకుంటే ఇక అంతే..!

ట్రాఫిక్ ఉల్లంఘనలపై HYD పోలీసులు స్పెషల్ డ్రైవ్ ప్రారంభించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది 2నెలల్లో ఇప్పటివరకు రాంగ్ సైడ్ డ్రైవింగ్‌తో ఒకరు మృతి చెందగా.. 21 మందికి గాయాలైనట్లు తెలిపారు. అస్పష్ట నంబరు ప్లేట్, వాహనదారులకు రూ.200 జరిమానాతో పాటు ఛార్జీషీటు దాఖలు చేస్తామన్నారు.
Similar News
News January 11, 2026
యాదగిరిగుట్ట: రేపే గిరిప్రదక్షిణ.. దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు

శ్రీలక్ష్మీనరసింహ స్వామి జన్మ నక్షత్రం (స్వాతి నక్షత్రం) పురస్కరించుకుని సోమవారం ఉదయం 5:30 గంటలకు గిరిప్రదక్షిణ నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. కొండ కింద వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలతో ఈ ప్రదక్షిణ ప్రారంభమవుతుంది. అనంతరం భక్తులకు ఉచిత దర్శనం, ప్రసాద వితరణ ఉంటుంది. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
News January 11, 2026
హన్మకొండ: యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సూసైడ్

హసన్‌పర్తి మండలం చింతగట్టు రైల్వే గేట్ వద్ద <<18830665>>మృతి చెందిన<<>> వ్యక్తిని అతని స్నేహితులు గుర్తించారు. మృతుడు నడికుడ మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన దూడే రాజుగా తెలిపారు. మృతుడు యూత్ కాంగ్రెస్ పరకాల ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. పల్సర్ బైకును పక్కన పెట్టి రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News January 11, 2026
చైనా, అమెరికాకు సాధ్యం కానిది ఇండియా సాధించింది: చంద్రబాబు

AP: బెంగళూరు-కడప-విజయవాడ కొత్త నేషనల్ హైవే వారం రోజుల వ్యవధిలోనే 4 గిన్నిస్ రికార్డులను సాధించిందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. 57,500 టన్నుల బిటుమినస్ కాంక్రీటుతో 156 లేన్ కి.మీ రహదారి నిర్మించారని కాంట్రాక్ట్ కంపెనీ రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకన్ లిమిటెడ్, NHAIను అభినందించారు. కొత్త రోడ్ల నిర్మాణంలో అమెరికా, చైనా, జర్మనీకి సాధ్యం కానిది.. భారత్ సుసాధ్యం చేసిందని ట్వీట్ చేశారు.


