News March 2, 2025
MBNR: చికిత్స పొందుతూ యువకుడి మృతి

రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్ప పొందుతూ ఓ యువకుడు మృతిచెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికులు వివరాలిలా.. కౌకుంట్ల మండలం రాజోలికి చెందిన శ్రీకాంత్(25), లింగేశ్‌లు స్కూటీపై వెళ్తూ టిప్పర్ ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీకాంత్ నిన్న మృతిచెందగా, లింగేశ్ పరిస్థితి విషమంగా ఉంది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News March 3, 2025
బాలానగర్: భార్యను అవమానపరిచిన భర్త.. చివరికి.!

ఓ మహిళ వాగులో దూకి మృతి చెందిన ఘటన బాలానగర్ మండలంలో సోమవారం జరిగింది. ఎస్ఐ లెనిన్ వివరాల ప్రకారం.. గుండెడ్ గ్రామానికి చెందిన లక్ష్మికి (38) ఫరూక్ నగర్ మండలం గంట్లవెల్లి గ్రామానికి చెందిన లింగమయ్యతో 17 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలు. ఆదివారం పెద్ద మనుషుల సమక్షంలో భార్యను అవమానపరిచి నిందించాడు. అవమానం భరించలేక దుందుభి వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేశారు.
News March 3, 2025
MBNR: అరుణాచలానికి పాలమూరు నుంచి ప్రత్యేక బస్సులు.!

తమిళనాడు రాష్ట్రంలోని ప్రత్యేక పుణ్యక్షేత్రం అరుణాచలానికి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం నుండి ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈనెల 12న మహబూబ్ నగర్ డిపో నుంచి బస్సు వెళ్లనున్నట్లు తెలిపారు. మార్చి 13 సా.6 గంటలకు అరుణాచలం చేరుకుంటుందన్నారు. మార్చి 14న అక్కడి నుంచి బయలుదేరి 15న ఉదయం మహబూబ్ నగర్ చేరుకుంటుందని అన్నారు. ప్రయాణికులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
News March 3, 2025
షాకింగ్: నల్లమలలో కార్చిచ్చు (PHOTO)

నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని రిజర్వు టైగర్ అటవీ ప్రాంతంలో కార్చిచ్చు సంభవించింది. దోమలపెంట సమీపంలో 10 కిలోమీటర్ల దూరంలో శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్లే రహదారి పక్కన వందలాది హెక్టార్లలో అడవి మొత్తం అగ్నికి ఆహుతైంది. ఎటు చూసినా మంటలు, పొగ కమ్మేసింది. ఈ ప్రమాదం ఎలా జరిగిందో వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.