News March 2, 2025

KNR: పరీక్షా నిర్వహణ సమయం పట్ల కేంద్ర మంత్రి అభ్యంతరం

image

ఈనెల 6 నుంచి నిర్వహించే పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలను మధ్యాహ్నం 12.15 నుంచి 3.15గంటలకు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమంజసం కాదని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. రంజాన్ పర్వదినాలను పురస్కరించుకొని ఈ నిర్ణయం తీసుకోవడం తీవ్ర అభ్యంతరకరమని పేర్కొన్నారు. ఆ సమయంలో విద్యార్థులు, అధ్యాపకులు సహా ప్రతి ఒక్కరూ లంచ్ చేసే సమయమని, ఈ సమయంలో పరీక్షలు నిర్వహించడం సరికాదని మండిపడ్డారు.

Similar News

News September 13, 2025

మాదకద్రవ్యాల నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు: కరీంనగర్ కలెక్టర్

image

జిల్లా స్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ కమిటీ సమావేశం ఈరోజు కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలీస్, ఎక్సైజ్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు సమన్వయంతో మాదకద్రవ్యాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు జిల్లాలో సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు.

News September 12, 2025

కరీంనగర్‌లో ఈనెల 17న జాబ్ మేళా

image

నిరుద్యోగులకు కరీంనగర్ కళ్యాణి జ్యువెలర్స్‌లో జాబ్స్ కోసం ఈనెల 17న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి తిరుపతిరావు తెలిపారు. 60 పోస్టులు ఉన్నాయని, డిగ్రీ పూర్తి చేసి, వయసు 19 నుంచి 30 ఏళ్లలోపు ఉండాలన్నారు. వేతనం రూ.20,000 అని, ఆసక్తి గల వారు ఈనెల 17న KNR ఉపాధి కార్యాలయంలో ఇంటర్వ్యూకు హాజరవ్వాలని, వివరాలకు 9052259333, 9944922677, 7207659969, 9908230384 నంబర్లను సంప్రదించాలని కోరారు.

News September 12, 2025

కరీంనగర్: సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్‌హెచ్‌ఓగా రమేశ్

image

కరీంనగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్‌హెచ్‌ఓగా డీఎస్పీ కోత్వాల్ రమేశ్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఎస్‌హెచ్ఓగా పనిచేసిన డీఎస్పీ నరసింహారెడ్డి హైదరాబాద్ సీసీఎస్‌కి బదిలీ కాగా ఆదిలాబాద్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్‌లో డీఎస్పీగా పనిచేసిన రమేశ్ కరీంనగర్‌కు బదిలీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం రమేశ్ సీపీ గౌస్ ఆలంను మర్యాద పూర్వకంగా కలిశారు.