News March 2, 2025

కేయు: రీసెర్చ్‌స్కాలర్స్‌ హాస్టల్‌ జాయింట్‌ డైరెక్టర్‌గా సాంబశివరావు

image

కాకతీయ యూనివర్సిటీలోని వివేకానంద రీసెర్చ్‌స్కాలర్స్‌ హాస్టల్‌ జాయింట్‌ డైరెక్టర్‌గా డాక్టర్‌ అంకశాల సాంబశివరావు నియమితులయ్యారు. ఈమేరకు శనివారం కేయూ రిజిస్ట్రార్‌ ఆచార్య రామచంద్రం ఉత్తర్వులు జారీ చేశారు. కేయూ వీసీ ఆచార్య కె.ప్రతాప్‌రెడ్డి చేతుల మీదుగా నియామక ఉత్తర్వులను సాంబశివరావు అందుకున్నారు. నియామక పత్రాన్ని అందుకున్న సాంబశివరావు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Similar News

News January 15, 2026

టెన్త్ అర్హతతో RBIలో ఉద్యోగాలు

image

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)లో 572 ఆఫీస్ అటెండెంట్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్‌లైన్ టెస్ట్, లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. పదో తరగతి పాసైన వారు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ, ఆపై చదువులు చదివిన వారికి అవకాశం లేదు. వయసు 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. కచ్చితంగా తమ స్థానిక భాష రాయడం, చదవడం వచ్చి ఉండాలి. దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 4. సైట్: <>rbi.org.in<<>>

News January 15, 2026

ఎర్రవెల్లి నివాసంలో KCR సంక్రాంతి వేడుకలు

image

TG: ఎర్రవెల్లి నివాసంలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కుటుంబ సభ్యులతో సంక్రాంతి వేడుకలు నిర్వహించుకున్నారు. కుమారుడు కేటీఆర్ కూడా ఫ్యామిలీతో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఫాంహౌజ్‌లో రంగు రంగుల ముగ్గు ముందు కేసీఆర్‌తో కలిసి దిగిన ఫొటోలను KTR Xలో షేర్ చేశారు. తమ కుటుంబసభ్యుల తరఫున రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ సంక్రాంతి విషెస్ చెప్పారు.

News January 15, 2026

గద్వాల్: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ ఎమ్మెల్యే

image

సీఎం రేవంత్ రెడ్డిని అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, MBNR ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి గురువారం కలిశారు. హైదరాబాదులోని ఆయన నివాసంలో కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని సీఎంకు ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులు, కేటీఆర్, హరీశ్ రావు చేస్తున్న వ్యాఖ్యల గురించి చర్చించినట్లు సమాచారం.