News March 2, 2025
సత్యవేడులో కేజీ చికెన్ ధర రూ.90

సత్యవేడు పట్టణంలో కేజీ చికెన్ 90 రూపాయలకు అమ్ముతున్నారు. లైవ్ చికెన్ 70 రూపాయలకే ఇస్తామని నిర్వాహకులు కోళ్ల చిన్న తెలిపారు. దీంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు చికెన్ కొనడానికి ఎగబడుతున్నారు. బుధవారం కేజీ చికెన్ ధరను 120-100 రూపాయలకు అమ్మారు. వరదయ్యపాలెం మండలంలో కేజీ చికెన్ ధర రూ.180 పలుకుతుంది.
Similar News
News July 7, 2025
KU పరిధిలో 2,356 సీట్లు

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో మొత్తం 2,356 ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ పరిధిలోని రెండు కాలేజీల్లో 780 సీట్లు ఉండగా.. నాలుగు ప్రైవేట్ కాలేజీల్లో 1,576 సీట్లను అందుబాటులోకి తెచ్చారు. ప్రైవేట్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 1,103 సీట్లను భర్తీ చేయనున్నారు. టీజీఎప్‌సెట్-2025 ఫస్ట్ ఫేజ్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఈ నెల 8 వరకు అవకాశం ఉండగా.. వెబ్ ఆప్షన్లకు 10 వరకు గడువు ఉంది.
News July 7, 2025
NLG: ముందుకు సాగని అమృత్ 2.0 పనులు

మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పనకు చేపట్టిన అమృత్ 2.0 పనులు జిల్లాలో అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో లక్ష జనాభా దాటిన NLG, MLG మున్సిపాలిటీల్లో మాత్రమే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు మంజూరయ్యాయి. జులై 2024న చేపట్టిన అమృత్ 2.0 పనులు 2026 మార్చి చివరి నాటికి పూర్తి కావాల్సి ఉంది. NLG పట్టణంలో పనులు ముమ్మరంగా.. మిగతా చోట నత్తనడకన నడుస్తున్నాయి.
News July 7, 2025
ఒంగోలు నుంచి వెళ్తుండగా ఉద్యోగి మృతి

ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి సోమవారం ఉదయం చనిపోయారు. ఒంగోలు నుంచి బైకుపై వెళ్తున్న వ్యక్తి జాగర్లమూడివారిపాలెం బ్రిడ్జి వద్ద హైవేపై చనిపోయారు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందా? లేదా అదుపుతప్పి ఆయనే కింద పడిపోయారా? అనేది తెలియాల్సి ఉంది. మృతుడు ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అని సమాచారం. ఒంగోలు నుంచి గుంటూరుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.