News March 2, 2025

రంజాన్ మాస శుభాకాంక్షలు: మోదీ

image

రంజాన్ మాసం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్రమాసంలో భక్తి, కరుణ ప్రతిబింబిస్తుందని ట్వీట్ చేశారు. సమాజంలో శాంతి, సామరస్యం నెలకొనాలని ఆకాంక్షించారు. ఈ రోజు నుంచే రంజాన్ ఉపవాసాలు ప్రారంభం అయ్యాయి.

Similar News

News January 12, 2026

ఈ OTTలోనే ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ స్ట్రీమింగ్!

image

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. నిన్న ప్రీమియర్స్‌తో రిలీజైన ఈ చిత్ర డిజిటల్ రైట్స్‌ను ‘ZEE5’ దక్కించుకోగా శాటిలైట్ హక్కులను ‘జీ తెలుగు’ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాతే ఇది OTTలో స్ట్రీమింగ్ కానుంది. అనంతరం బుల్లితెరపై సందడి చేయనుంది. మీరూ సినిమా చూస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి.

News January 12, 2026

పెట్టుబడుల డెస్టినేషన్‌గా ఏపీ: చంద్రబాబు

image

AP: దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25శాతం రాష్ట్రానికే వచ్చాయని మంత్రులు, అధికారుల సమావేశంలో సీఎం చంద్రబాబు తెలిపారు. దీంతో స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ల డెస్టినేషన్‌గా మారిందన్నారు. సీఐఐ ద్వారా చేసుకున్న ఒప్పందాలన్నీ సాకారం అయితే 16లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతిలో క్వాంటం వ్యాలీకి త్వరలో ఫౌండేషన్ వేయనున్నట్లు వెల్లడించారు.

News January 12, 2026

APPLY NOW: CSIR-CECRIలో ఉద్యోగాలు

image

<>CSIR<<>>-సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(CECRI)లో 15సైంటిస్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి PhD, ME, MTech ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. జీతం నెలకు రూ.1,19,424 చెల్లిస్తారు. ఇంటర్వ్యూ, రాత పరీక్ష/సెమినార్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.cecri.res.in