News March 2, 2025

సంగారెడ్డి: బాలింత మృతితోఆందోళన.. కేసు నమోదు.!

image

వైద్యుల నిర్లక్ష్యంతో <<15621244>>బాలింత మృతి<<>> చెందిందని బాధిత కుటుంబీకులు ఆందోళన చేశారని సంగారెడ్డి ఎస్‌ఐ పి.రవీందర్ అన్నారు. ఎస్‌ఐ వివరాలు.. కోహీర్ మండలం మద్రికి చెందిన గర్భిణీ మహానందిని ప్రసవానికి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రసవంలో ఆడ శిశువు పుట్టగా, బాలింత మృతి చెందింది. భర్త నవీన్, కుటుంబీకులు కన్నీళ్ల పర్యంతమై ఆస్పత్రిలో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News November 11, 2025

నిజామాబాద్: ఆరుగురికి జైలు శిక్ష

image

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన ఆరుగురికి జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ మంగళవారం తీర్పు చెప్పారని NZB ట్రాఫిక్ CI ప్రసాద్ తెలిపారు. ఇద్దరికి 4 రోజులు, మరో ఇద్దరికి 3 రోజులు, మరో ఇద్దరికి 7 రోజుల చొప్పున జైలు శిక్ష విధించినట్లు చెప్పారు. అలాగే 28 మందికి రూ.2.69 లక్షల జరిమానా విధించినట్లు వివరించారు.

News November 11, 2025

తెలంగాణ న్యూస్

image

⋆ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో CID విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ.. గంటపాటు విచారించి స్టేట్‌మెంట్ రికార్డు చేసిన అధికారులు
⋆ HYD: ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారని కాంగ్రెస్ MLAలు బీర్ల ఐలయ్య, రామచంద్రు నాయక్, రామదాసుపై మధురా నగర్ పీఎస్‌లో కేసు నమోదు.. BRS నేతలు వినయ్ భాస్కర్, ఆనంద్‌పై బోరబండ పీఎస్‌లో కేసు నమోదు
⋆ మరో గంటలో ముగియనున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్‌

News November 11, 2025

అధిక పాలిచ్చే పశువును ఎలా గుర్తించాలి?(1/2

image

పాడి ద్వారా ఎక్కువ ఆదాయం రావాలంటే మనం కొనే పశువు ప్రతి 14 నుంచి 15 నెలలకు ఒకసారి ఈనేట్లు ఉండాలి. పాడి పశువు పాలసార గురించి తెలుసుకోవాలంటే ఆ పశువు పొదుగును గమనించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు. పొదుగు పెద్దదిగా ఉండి, శరీరంలో కలిసినట్లుగా ఉండాలి. అలాకాకుండా పొదుగు వేళ్లాడుతూ, జారిపోతున్నట్లుగా ఉండకూడదు. నాలుగు పాలసిరల (చనుమొనలు) అమరిక చతురస్రాకారంగా ఉండి, అన్నింటి నుంచి పాలు సులువుగా వస్తుండాలి.