News March 2, 2025

ఎస్ఎల్‌బీసీ ఘటనా స్థలానికి నేడు సీఎం రేవంత్ రెడ్డి రాక

image

ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో జరిగిన దుర్ఘటన స్థలాన్ని పరిశీలించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు వస్తున్నట్లు సమాచారం. సీఎం ఈరోజు మధ్యాహ్నం వనపర్తి పట్టణంలో జరిగే బహిరంగ సభ అనంతరం హెలీప్యాడ్ ద్వారా దోమలపెంటకు చేరుకుంటారని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో దుర్ఘటన జరిగిన స్థలానికి వెళ్లనున్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. దుర్ఘటన జరిగి తొమ్మిది రోజులు కావస్తోంది.

Similar News

News November 13, 2025

టుడే..

image

* ఢిల్లీలో ఇండో-యూఎస్ సమ్మిట్ ప్రతినిధులతో భేటీ కానున్న సీఎం రేవంత్.. అనంతరం పార్టీ పెద్దలతో సమావేశం
* AP: ఎస్సీ, ఎస్టీలకు ఉచిత యూపీఎస్సీ కోచింగ్.. నేటి నుంచి 16వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
* విశాఖలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన
* రుషికొండ ఐటీ పార్కులో ఫెనోమ్ క్యాంపస్‌కు శంకుస్థాపన చేయనున్న మంత్రి లోకేశ్

News November 13, 2025

పాల వ్యాపారం.. ఏడాదిలో రూ.2 కోట్ల ఆదాయం

image

పాల వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తున్నారు గుజరాత్‌లోని బనస్కాంతకు చెందిన 65 ఏళ్ల మణిబెన్. ఆమె 2011లో 12 ఆవులతో డెయిరీ ఫామ్ ప్రారంభించారు. ప్రస్తుతం ఫామ్‌లో 230 ఆవులు, బర్రెలున్నాయి. మెషిన్లతో పాలను తీస్తూ రోజూ 1100 లీటర్లను గ్రామ కోఆపరేటివ్ డెయిరీకి సరఫరా చేస్తున్నారు. ఇలా 2024-25లో 3.47లక్షల లీటర్ల పాలను అమ్మి రూ.1.94 కోట్ల ఆదాయం పొందారు.✍️ మరింత సమాచారానికి <<-se_10015>>పాడిపంట<<>> కేటగిరీ క్లిక్ చేయండి.

News November 13, 2025

సమస్యలను మానవత్వంతో పరిష్కరించాలి: కలెక్టర్

image

విభిన్న ప్రతిభావంతుల సమస్యలను మానవతా దృక్పథంతో పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. బుధవారం ఏలూరు కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. వారికి వృత్తిపరమైన నైపుణ్య శిక్షణ ఇచ్చి, ప్రత్యేక జాబ్ మేళాలు నిర్వహించి ఉద్యోగాలు కల్పించాలన్నారు. సదరం రీ-వెరిఫికేషన్‌ను, ఉపకరణాల పంపిణీని వేగవంతం చేయాలని ఆదేశించారు.