News March 22, 2024

మనిషికి పంది కిడ్నీ మార్పిడి

image

ఓ మనిషికి వైద్యులు పంది కిడ్నీని అమర్చారు. ఇలా చేయడం ప్రపంచంలోనే తొలిసారని వైద్యులు తెలిపారు. ఈ ఘటన అమెరికాలోని మసాచుసెట్స్‌లో జరిగింది. కిడ్నీలు ఫెయిలైన 62 ఏళ్ల రోగికి 4 గంటలపాటు సర్జరీ చేసి పంది కిడ్నీని అమర్చారు. ప్రస్తుతం ఆ వ్యక్తి కోలుకుంటున్నారు. కాగా ఈ ప్రయోగం మంచి ఫలితాలిస్తే ప్రపంచంలోని కిడ్నీ రోగులకు ఇది ఒక శుభవార్తేనని వైద్యులు అంటున్నారు.

Similar News

News April 10, 2025

బ్యాడ్మింటన్ ఆసియా: రెండో రౌండ్‌కు దూసుకెళ్లిన సింధు

image

బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్ షిప్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు. ఇండోనేషియాకు చెందిన ఎస్తేర్ వార్డోయోపై ఆమె వరస సెట్లలో 21-15, 21-19 తేడాతో గెలుపొందారు. తర్వాతి రౌండ్‌లో జపాన్‌కు చెందిన అకానీ యమగుచీతో ఆమె తలపడనున్నారు. మరోవైపు లక్ష్యసేన్, ప్రణోయ్ ఇద్దరూ ఇంటిబాట పట్టారు.

News April 10, 2025

ఒంటిమిట్ట కళ్యాణోత్సవానికి టీటీడీ లడ్డూలు

image

AP: కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామ స్వామి కళ్యాణం రేపు సాయంత్రం 6.30 గంటల నుంచి కన్నులపండువగా జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యే భక్తుల కోసం టీటీడీ 70వేల లడ్డూలను పంపించనుంది. తిరుమలలోని శ్రీవారి సేవాసదన్-2లో సేవకులు ఈ లడ్డూల ప్యాకింగ్ పూర్తి చేశారు. రేపు కళ్యాణం అనంతరం భక్తులకు వీటిని పంచిపెట్టనున్నారు.

News April 10, 2025

లండన్‌లో ఆ హీరోహీరోయిన్ల కాంస్య విగ్రహాలు

image

భారత సినీ చరిత్రలో ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. విడుదలై 30 ఏళ్లు గడచిన సందర్భంగా ఆ మూవీకి లండన్‌లో అరుదైన గౌరవం దక్కనుంది. అక్కడి లైసెస్టర్ స్క్వేర్‌లో DDLJ హీరోహీరోయిన్లు షారుఖ్, కాజోల్‌ కాంస్య విగ్రహాల్ని నెలకొల్పనున్నారు. ఈ ఘనత దక్కించుకున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. ఈ ఏడాది చివరిలోపు విగ్రహాల్ని ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది.

error: Content is protected !!