News March 2, 2025
HYD: యువకుడితో పరారైన 35 ఏళ్ల వివాహిత

ఓ వివాహిత యువకుడితో పరారైన ఘటన మేడ్చల్ పేట్‌బషీరాబాద్‌లో జరిగింది. KPHBలో ఉంటున్న పల్నాడుకు చెందిన గోపి(22)కి వరంగల్‌కు చెందిన సుకన్య(35)కు ఓ యాప్‌లో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. FEB 5న గోపిని కలిసేందుకు సుకన్య వస్తుందని గుర్తించిన భర్త వారిని వెంబడించాడు. బైక్‌పై వెళ్తుండగా.. భర్త అడ్డుకోవడంతో బైక్ వదిలేసి ఇద్దరు పరారయ్యారు. భర్త పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Similar News
News November 7, 2025
పెద్దపల్లి: ‘కనీస విద్యా ప్రమాణాల పెంపునకు కృషి’

ఏఐ ల్యాబ్‌ల ద్వారా విద్యా ప్రమాణాల పెంపుపై దృష్టి సారించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. ఏఎక్స్ఎల్ పాఠశాలల పురోగతిపై సమీక్ష నిర్వహించిన ఆయన.. ప్రతి విద్యార్థి రోజూ కనీసం అరగంట ఏఐ ల్యాబ్‌లో గడపాలని సూచించారు. అదనంగా కంప్యూటర్ సిస్టమ్స్ ఏర్పాటుచేసి, తెలుగు, ఇంగ్లీష్, గణితంలో విద్యార్థుల నైపుణ్యాలు పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
News November 7, 2025
బట్టతల రాబోతోందని గుర్తించడం ఎలాగంటే..

– హెడ్ టెంపుల్స్ (M షేప్) కన్పించడం (పై ఫొటో చూడండి)
– తల పైభాగం, పరిసరాల్లో జుట్టు పలుచబడటం
– కటింగ్/గుండు చేయించాక రీగ్రోత్ స్లో కావడం
– దువ్వినా/తలస్నానం చేసినా సాధారణం కంటే ఎక్కువగా హెయిర్ ఫాల్
> కొన్ని మెడిసిన్స్ వాడకం, ఫ్యామిలీ హిస్టరీ, స్మోకింగ్, ఒత్తిడి, నిద్రలేమి, చర్మ సమస్యలు, పోషకాహార లోపంతో బట్టతల అవకాశాలు పెరుగుతాయి.
> సరైన చికిత్సతో కొంత ఫలితం ఉంటుంది.
Share It
News November 7, 2025
ప్రతీకా రావల్‌కు ప్రపంచకప్ మెడల్!

గాయం కారణంగా మహిళల ప్రపంచకప్ చివరి 2 మ్యాచ్‌లకు ప్రతీకా రావల్ <<18122584>>దూరమైన<<>> విషయం తెలిసిందే. ఆమె స్థానంలో స్క్వాడ్‌లోకి షెఫాలీ వర్మ రావడంతో ప్రతీకకు మెడల్ దక్కలేదు. ఈ నేపథ్యంలో ICC ఛైర్మన్ జైషా చొరవ తీసుకున్నారు. ‘మెడల్ అందజేసేందుకు ఏర్పాట్లు చేయాలనుకుంటున్నట్లు జైషా నా మేనేజర్‌కు మెసేజ్ చేశారు. తర్వాత మెడల్ వచ్చేసింది. తొలిసారి దాన్ని చూసి నాకు కన్నీళ్లు ఆగలేదు’ అని ప్రతీక చెప్పారు.


