News March 22, 2024
పంజాబ్‌లో 120+ ఏళ్ల ఓటర్లు 205 మంది

సెంచరీ దాటి 20 ఏళ్లయినా ఓటేయడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు పంజాబ్ కురువృద్ధులు. అక్కడ 120 ఏళ్లు దాటిన ఓటర్లు ఏకంగా 205 మంది ఉన్నారని ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సిబిన్ వెల్లడించారు. వారిలో 122 మంది పురుషులు, 83 మంది మహిళలు ఉన్నారని చెప్పారు. 100 నుంచి 119 ఏళ్ల వయసున్న వారు 5,004 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. వీరిలో పురుషులు 1,976 మంది, మహిళలు 3,028 మంది ఉన్నారన్నారు.
Similar News
News September 10, 2025
మహిళలు నేడు ఈ వ్రతం చేస్తే చాలా మంచిది

నేడు ఉండ్రాళ్ల తద్ది. ఈ వ్రతం గురించి ఆ పరమేశ్వరుడే స్వయంగా పార్వతీ దేవికి వివరించారని చెబుతారు. ఈ వ్రతాన్ని స్త్రీలు భక్తి విశ్వాసాలతో నిష్ఠానుసారంగా ఆచరిస్తే వారికి సర్వాభీష్ట సిద్ధి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. పెళ్లైన మహిళలు భర్త, సంతానంతో కలిసి ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ నోమును ఆచరిస్తారు. పెళ్లికాని అమ్మాయిలు కూడా ఆచరించొచ్చని, ఫలితంగా మంచి భర్త దొరుకుతాడని వేద పండితులు అంటున్నారు.
News September 10, 2025
‘ఉండ్రాళ్ల తద్ది’ వ్రతం ఎలా చేయాలి?

మహిళలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే పార్వతీ దేవి సకల సౌభాగ్యాలు వర్ధిల్లే వరమిస్తుందని పండితులు చెబుతున్నారు. ‘మహిళలు నేడు సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి. బియ్యం పిండితో ఉండ్రాళ్లు చేయాలి. గౌరీ దేవిని పూజించి ఆమెకు ఉండ్రాళ్లు నివేదించాలి. ఐదుగురు ముత్తైదువులను పిలిచి చీర, రవికలతో పాటు ఉండ్రాళ్లు వాయనమివ్వాలి. వారి పాదాలకు పసుపు రాసి, ఆశీస్సులు పొంది, అక్షతలు వేయించుకుంటే శుభం కలుగుతుంది’ అని అంటున్నారు.
News September 10, 2025
‘ఉండ్రాళ్ల తద్ది’.. ప్రాచుర్యంలో ఉన్న కథ

పూర్వం ఓ రాజు ఉండేవాడు. ఆయనకు ఏడుగురు భార్యలున్నా వేశ్య ‘చిత్రాంగి’ పైనే ఎక్కువ అనురాగం ఉండేది. ఓనాడు రాజు భార్యలందరూ ఉండ్రాళ్ల తదియ నోము నోచుకుంటున్నారని ఆమెకు తెలుస్తుంది. ఆమె కూడా ఈ వ్రతం చేయాలని అనుకుంటుంది. రాజు అనుమతితో భాద్రపద తృతీయ నాడు ఉండ్రాళ్లు చేసి, గౌరీ దేవికి నైవేద్యంగా పెట్టి, కొందరు స్త్రీలకి వాయనమిస్తుంది. ఐదేళ్లపాటు నిర్విఘ్నంగా నోము నోయడంతో వేశ్య అయినా ఆమె సద్గతి పొందింది.