News March 2, 2025
MDCL జిల్లాలో 5,30,590 రేషన్ కార్డులు

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో తాజాగా 6,700 రేషన్ కార్డులు జారీ చేయగా రేషన్ కార్డుల సంఖ్య 5,30,590కు చేరుకుంది. ఈ వివరాలను పౌరసరఫరాల శాఖ అధికారులు విడుదల చేశారు. మార్చి నెలలో ప్రతీ రేషన్ కార్డుదారుడు వారి అవకాశాలను తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అధికారుల బృందం సూచించింది.
Similar News
News September 17, 2025
భీమారం: రైతులు ఆందోళన చెందవద్దు: కలెక్టర్

జిల్లాలో వ్యవసాయ సాగుకు అవసరమైన మేరకు యూరియా పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ చెప్పారు. భీమారం మండల కేంద్రంలో వ్యవసాయ అధికారి సుధాకర్‌తో కలిసి రైతులతో మాట్లాడారు. మండలంలో గత సంవత్సరం 14 మెట్రిక్ టన్నుల యూరియా వినియోగించబడిందని, ఈ సంవత్సరం ఇప్పటికే 11 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేశామన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని, వ్యవసాయ సాగుకు అవసరం మేర యూరియా అందిస్తామన్నారు.
News September 17, 2025
నేటి నుంచి మహిళకు ఉచిత వైద్య పరీక్షలు: అనకాపల్లి జేసీ

మహిళల ఆరోగ్య పరిరక్షణకు స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం ఎంతో దోహదం చేస్తుందని అనకాపల్లి జేసీ ఎం.జాహ్నవి అన్నారు. ఈ పథకానికి సంబంధించి గోడ పత్రికను జాయింట్ కలెక్టరు కార్యాలయ ఛాంబర్ మంగళవారం ఆవిష్కరించారు. జిల్లాలోని 46 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో నేటి నుంచి అక్టోబర్ 2 వరకు మహిళలకు వివిధ రకాల స్క్రీనింగ్ పరీక్షలు చేసి అవసరమైన వైద్య సహకారాన్ని అందిస్తామన్నారు.
News September 17, 2025
MNCL: సమ్మె బాట పట్టిన విద్యుత్ కాంట్రాక్టర్లు

మంచిర్యాల జిల్లాలో టీజీ ఎన్పీడీసీఎల్ విద్యుత్ కాంట్రాక్టర్లు నేటి నుంచి సమ్మె బాట చేపట్టారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్ మాట్లాడుతూ.. మార్కెట్‌లో ధరలకు అనుకూలంగా లేబర్ ఛార్జీలు పెరిగి తాము చేసే పనులలో 40 శాతం నష్టం వాటిల్లుతుందని తెలిపారు. వెంటనే యాజమాన్యం తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని ఆయన కోరారు.