News March 2, 2025

సి. బెళగల్ : చెట్టు విరిగి పడి బాలిక మృతి

image

సి.బెళగల్ మండలం పోలకల్ జెడ్పీ హైస్కూల్లో శుక్రవారం చెట్టు విరిగిన పడి 8వ తరగతి విద్యార్థిని శ్రీలేఖ గాయపడిన విషయం తెలిసిందే. కాగా బాలిక కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 10 గంటలకు మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. ఇది దురదృష్టకరమని, బాధిత కుటుంబానికి విద్యాశాఖ రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని NUSI జిల్లా అధ్యక్షుడు వీరేశ్ యాదవ్ డిమాండ్ చేశారు.

Similar News

News September 13, 2025

HYD: Ed.CET రిజల్ట్ కోసం ఎదురుచూపులు

image

Ed.CET 2025 సెకండ్ ఫేజ్ రిజల్ట్ సెప్టెంబర్ 12న ప్రకటిస్తామని అధికారులు తెలియజేసినప్పటికీ ఫలితాలు విడుదల చేయలేదు. దీంతో పరీక్ష రాసి, వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ ఇచ్చిన అభ్యర్థులు రిజల్ట్ కోసం వేచి చూస్తున్నారు. దీనిపై HYD తార్నాక ఉస్మానియా యూనివర్సిటీ అధికారులను వివరణ కోరగా, టెక్నికల్ సమస్య కారణంగా ఆలస్యం జరిగిందని, త్వరలోనే రిజల్ట్ ప్రకటిస్తామన్నారు.

News September 13, 2025

ముంబై పేలుళ్ల కేసు.. రూ.9 కోట్లు ఇప్పించాలని నిర్దోషి డిమాండ్

image

2006 ముంబై పేలుళ్ల కేసులో అరెస్టయి 2015లో నిర్దోషిగా విడుదలైన అబ్దుల్ వాహిద్ షేక్ పరిహారం కోరుతూ NHRCని ఆశ్రయించాడు. కస్టోడియల్ టార్చర్ వల్ల ఆరోగ్యం, వ్యక్తిగత జీవితం దెబ్బతిన్నాయని, రూ.9CR ఇప్పించాలని దరఖాస్తు చేశాడు. 2015లో ఈ కేసులో ఐదుగురికి మరణశిక్ష, ఏడుగురికి జీవిత ఖైదు విధించగా, మిగిలిన 12 మంది నిందితులను ఈ ఏడాది జులైలో కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. పేలుళ్ల ఘటనలో 180+ మంది మరణించారు.

News September 13, 2025

‘అనంత జిల్లాకు వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండండి’

image

అనంతపురం జిల్లాలో ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదవుతున్నాయని శాస్త్రవేత్త విజయ్ శంకర్ బాబు తెలిపారు. మేఘాలు కమ్ముకుని అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. గరిష్ఠ ఉష్ణోగ్రత 33.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 20.0 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతుందన్నారు. పశ్చిమ దిశగా గాలులు గంటకు 8 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో వీస్తాయన్నారు.